Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు..

విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్‌లో 9 వేలు ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు.

Virat Kohli creates history becomes first player to score 9000 ipl runs (pic credit@ipl)

  • విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త
  • ఐపీఎల్‌లో 9 వేల ప‌రుగులు 
  • ఈ ఘ‌న‌త సాధించిన ఒకే ఒక్క‌డు

Virat Kohli : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్‌లో 9 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న తొలి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. సోమ‌వారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు ఈఘ‌న‌త అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 11 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద ఐపీఎల్‌లో 9 వేల మెలురాయిని చేరుకున్నాడు.

ఐపీఎల్ ఆరంభం (2008) నుంచి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌రుపున‌నే కోహ్లీ ఆడుతున్నాడు. 267 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ మొత్తంగా 9012 ప‌రుగులు సాధించాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. అత‌డి త‌రువాతి స్థానంలో రోహిత్ శ‌ర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 271 ఇన్నింగ్స్‌ల్లో 7183 పరుగులు సాధించాడు.

Sakshi Dhoni Watch: సాక్షి ధోని వాచ్ ధ‌ర తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం జీవితాంతం హ్యాపీగా..

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..

* విరాట్ కోహ్లీ – 267 ఇన్నింగ్స్‌లలో 9012 పరుగులు
* రోహిత్ శర్మ – 271 ఇన్నింగ్స్‌లలో 7183 పరుగులు
* శిఖర్ ధావన్ – 221 ఇన్నింగ్స్‌లలో 6769 పరుగులు
* డేవిడ్ వార్నర్ – 184 ఇన్నింగ్స్‌లలో 656 పరుగులు
* కేఎల్ రాహుల్ – 144 ఇన్నింగ్స్‌లలో 5580 పరుగులు

ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఆర్‌సీబీ బౌల‌ర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 16.3 ఓవ‌ర్ల‌లో 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అభిషేక్ పోరెల్ (30; 33 బంతుల్లో 3 ఫోర్లు), డేవిడ్ మిల్ల‌ర్ (19; 18 బంతుల్లో 3 ఫోర్లు), కైల్ జేమీసన్ (12; 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో జోష్ హేజిల్‌వుడ్ నాలుగు వికెట్లు తీశాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. రసిఖ్ సలాం దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా లు త‌లా ఓ వికెట్ సాధించారు.

Priya saroj : స్టాండ్స్‌లో కాబోయే భార్య‌.. ఆమెను చూస్తూ మైదానంలో పెను విధ్వంసం సృష్టించిన కేకేఆర్ ప్లేయ‌ర్.. ఫోటోలు వైర‌ల్‌

ఆ త‌రువాత 76 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఆర్‌సీబీ 6.3 ఓవ‌ర్ల‌లో వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆర్‌సీబీ బ్యాట‌ర్ల‌లో దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (34 నాటౌట్; 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), విరాట్ కోహ్లీ (23 నాటౌట్‌; 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స‌ర్లు), జాక‌బ్ బెథెల్ (20; 11 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) రాణించారు. ఆర్‌సీబీ కోల్పోయిన ఒక్క వికెట్‌ను కైల్ జేమీసన్ ప‌డ‌గొట్టాడు.