Virat Kohli : ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ ఖాతాలో ఇదే చెత్త రికార్డు..!

Virat Kohli : ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ చెత్త రికార్డు అంటే ఇదేనేమో.. అనవసర షాట్ ఆడి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇదే కోహ్లీ ఖాతాలో అత్యంత చెత్త రికార్డుగా నమోదైంది.

Virat Kohli : ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ చెత్త రికార్డు అంటే ఇదేనేమో.. అనవసర షాట్ ఆడి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇదే కోహ్లీ ఖాతాలో అత్యంత చెత్త రికార్డుగా నమోదైంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో కోహ్లీ తన నిర్లక్ష్యంతో అనవసరంగా వికెట్ చేజార్చుకున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants)తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ బలహీనతను లక్నో కెప్టెన్ రాహుల్ సరిగ్గా వాడుకున్నాడు. దుశ్మంత చమీరను బౌలింగ్‌కు దింపి కోహ్లీకి ఆఫ్ స్టంప్ యాంగిల్ బంతిని వేయమన్నాడు.

కోహ్లీ ఆ బంతిని తాను ఆడలేనని తెలిసి కూడా నిర్లక్ష్యంగా బంతిని బౌండరీ దాటించేందుకు ప్రయత్నించాడు. అంతే.. ఆ బంతి కాస్తా బౌండరీ కన్నా ముందు బ్యాక్ వర్డ్ పాయింట్లో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చాడు. అంతే.. చేతులరా తన వికెట్ ను గోల్డెన్ డకౌట్ కింద పెవిలియన్ చేరాడు.

ముందు వెనుక ఆలోచించకుండా అనవసరపు షాట్ ఆడబోయి కోహ్లి తన ఐపీఎల్ హిస్టరీలో చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. కోహ్లీ డకౌట్ గా వెనుదిరగడం ఇదే తొలిసారి కాదు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ గోల్డెన్‌ డకౌట్ అవ్వడం ఇది నాలుగోసారి. ఈ సీజన్‌లో కోహ్లి పవర్‌ ప్లేలో మూడోసారి ఔటయ్యాడు.

అలాగే ఆడిన 4 మ్యాచ్‌ల్లో కోహ్లీ పవర్‌ ప్లే సమయంలో క్రీజులోకి వచ్చి 3సార్లు వికెట్ సమర్పించుకున్నాడు. కోహ్లీ సాధించిన పరుగులు కూడా 25కు మించి లేవనే చెప్పాలి. 2008లో ఆశిష్‌ నెహ్రా, 2014లో సందీప్‌ శర్మ, 2017లో నాథన్‌ కౌల్టర్‌నీల్‌, 2022లో దుష్మంత చమీర కోహ్లిని గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ పంపించారు.

Read Also : Virat Kohli: కోహ్లీ సెలబ్రేషన్స్‌కు షాక్ అయిన వార్నర్

ట్రెండింగ్ వార్తలు