Virat Kohli: కోహ్లీ సెలబ్రేషన్స్‌కు షాక్ అయిన వార్నర్
విరాట్ కోహ్లీ మైదానంలో ఉంటేనే కాదు.. మ్యాచ్ జరుగుతున్నంతసేపు అగ్రెసివ్నెస్ పీక్స్ లో ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇది చూశాం. తోటి ప్లేయర్లలో జోష్ నింపడానికి ఇది సరిపోదా. తాను ఆడుతున్
Virat Kohli: విరాట్ కోహ్లీ మైదానంలో ఉంటేనే కాదు.. మ్యాచ్ జరుగుతున్నంతసేపు అగ్రెసివ్నెస్ పీక్స్ లో ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇది చూశాం. తోటి ప్లేయర్లలో జోష్ నింపడానికి ఇది సరిపోదా. తాను ఆడుతున్న జట్టు బౌలింగ్‌కి ఒక్క వికెట్ పడినా చెలరేగిపోతుంటాడు. ఇలాగే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యేసరికి అగ్రెసివ్ అయిపోయాడు.
ఆశగా ఎదురుచూస్తున్న ఆర్సీబీకి 12వ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాట్స్‌మన్ దొరికిపోయాడు. కాకపోతే.. ఆ నిర్ణయంపై అటూఇటుగా ఉండటంతో దినేశ్ కార్తీక్, కెప్టెన్ డుప్లెసిస్ రివ్యూ కోరారు. రివ్యూలో, రీప్లేలో బంతి స్టంప్స్ వైపుకే వెళ్తున్నట్లు స్పష్టమైంది. అలా వార్నర్ అవుట్ అని చెప్పేశాడు.
నిర్ణయం కోసం ఆతురతగా ఎదురుచూసిన కోహ్లీ.. అవుట్ అని తెలియగానే అంపైర్, వార్నర్ వైపుగా పరిగెత్తుకుంటూ.. ఎగురుకుంటూ వెళ్లాడు. ఈ సెలబ్రేషన్ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఫుల్ కామెంట్లు వస్తున్నాయి.
Read Also: ప్లేయర్లా ఉన్నప్పటికీ కెప్టెన్‌లాగే ఆడతా- విరాట్ కోహ్లీ
ఈ మ్యాచ్ లో కోహ్లీ 12పరుగులు మాత్రమే చేసినా.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ క్యాచ్ అందుకుని 17వ ఓవర్లో అవుట్ అవడానికి కారణమయ్యాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీపై ఆర్సీబీ 16పరుగుల తేడాతో గెలుపొంది లీగ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.