Virat Kohli drops Mominul Haque at slip just before his hundred
Virat Kohli : ఫిట్‌నెస్‌కు మారుపేరుగా మారాడు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. మైదానంలో అందరి కంటే ఎంతో చురుకుగా ఉంటూ మెరుగైన ఫీల్డింగ్ చేస్తూ సహచర ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతూ ఉంటాడు. అయితే.. కాన్పూర్ టెస్టులో స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన కోహ్లీ ఓ క్యాచ్‌ను మిస్ చేశాడు. దీన్ని సద్వినియోగం చేస్తున్న బంగ్లాదేశ్ బ్యాటర్ మోమినుల్ హక్ శకతంతో చెలరేగాడు. కోహ్లీ మిస్ చేసిన క్యాచ్ కాస్త కష్టమైనదే.
వివరాల్లోకి వెళితే.. వర్షం, మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడి కారణంగా కాన్పూర్ టెస్టు మ్యాచులో రెండో, మూడో రోజు ఆట రద్దైంది. ఇక ఎట్టకేలకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో నాలుగో రోజు మ్యాచ్ ప్రారంభమైంది. ఓ వైపు భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. అయితే.. మరోవైపు టీమ్ఇండియాకు కొరకరాని కొయ్యగా తయరు అయ్యాడు మోమినుల్ హక్. తనదైన శైలిలో షాట్లు ఆడుతూ శతకానికి చేరువ అయ్యాడు.
అతడి వ్యక్తిగత స్కోరు 95 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిరాజ్ బౌలింగ్‌లో ఎడ్జ్ తీసుకున్న బంతి మొదటి, రెండో స్లిప్ మధ్యలో గాల్లోకి లేచింది. మొదటి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ.. తన ఎడమ వైపు డైవ్ చేస్తూ ఎడమ చేత్తో బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. బంతి అతడి వేళ్లను తాకుతూ కిందపడింది. దీంతో మోమినుల్ హక్ బతికిపోయాడు.
దీన్ని సద్వినియోగం చేసుకున్న అతడు శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కాగా.. ఈ క్యాచ్ కష్టమైనదే అయినప్పటికి కోహ్లీ లాంటి ఆటగాడికి మాత్రం కష్టం కాదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బంగ్లాదేశ్ 70 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. క్రీజులో మోమినుల్ హక్ (106), తైజుల్ ఇస్లాం (5) లు క్రీజులో ఉన్నారు.
Musheer Khan : యాక్సిడెంట్ తరువాత తొలిసారి మాట్లాడిన ముషీర్ ఖాన్.. మెడకు పట్టీ పెట్టుకుని..
— Kirkit Expert (@expert42983) September 30, 2024