Musheer Khan : యాక్సిడెంట్ తరువాత తొలిసారి మాట్లాడిన ముషీర్ ఖాన్.. మెడకు పట్టీ పెట్టుకుని..
టీమ్ఇండియా ఆటగాడు సర్ఫరాజ్ తమ్ముడు, ముంబై ఆల్‌రౌండర్ ముషీర్ ఖాన్ యాక్సిడెంట్ తరువాత తొలిసారి మాట్లాడాడు.

Musheer Khan gives first reaction after surviving car accident
Musheer Khan : టీమ్ఇండియా ఆటగాడు సర్ఫరాజ్ తమ్ముడు, ముంబై ఆల్‌రౌండర్ ముషీర్ ఖాన్ యాక్సిడెంట్ తరువాత తొలిసారి మాట్లాడాడు. ఇది తనకు మరో జన్మ అని చెప్పుకొచ్చాడు. దేవుడి దయ, అభిమానుల ప్రార్థనల వల్ల తనతో పాటు తన తండ్రి ప్రాణాలతో బయటపడినట్లు తెలిపాడు.
తన తండ్రి నౌషాద్ ఖాన్‌తో కలిసి ముషీర్ ఖాన్ కారులో ప్రయాణిస్తుండగా లక్నో శివార్లలో ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముషీర్ ఖాన్ మెడకు గాయమైంది. అతడి తండ్రి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.
IRE vs SA : టీ20 క్రికెట్‌లో పెను సంచలనం.. దక్షిణాఫ్రికా పై ఐర్లాండ్ విజయం..
కాగా.. గాయం కారణంగా ముషీర్ మూడు నెలల పాటు ఆటకు దూరం అయ్యాడు. యాక్సిడెంట్ తరువాత తన తండ్రితో కలిసి ముషీర్ తొలిసారి మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో.. ఇది తనకు మరో జన్మ అని. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నట్లు వెల్లడించాడు. తన తండ్రి సైతం క్షేమంగానే ఉన్నట్లు తెలిపాడు. తన కోసం ప్రార్థించిన అందరికి ధన్యవాదాలు తెలియజేశాడు ముషీర్ ఖాన్.
ముషీర్ ఖాన్‌కు వైద్య సాయం అందిస్తున్న MCA(ముంబై క్రికెట్ అసోసియేషన్), BCCIకి కృతజ్ఞతలు తెలియజేశారు ముషీర్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్.
ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో భారీ శతకం బాదాడు ముషీర్. అక్టోబర్ 1 నుంచి 5 వరకు జరగనున్న ఇరానీ కప్‌లో అతడు ముంబై తరుపున బరిలోకి దిగాల్సి ఉంది. రోడ్డు ప్రమాదం కారణంగా అతడు కొన్ని నెలల పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది.
View this post on Instagram