County Championship : బ్యాటర్ క్లీన్‌బౌల్డ్ అయినా ఔట్ ఇవ్వని అంపైర్.. ఇలాంటి ఓ రూల్ కూడా ఉందా? టవల్ కారణమా?
ఓ బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బౌలర్‌తో పాటు ఫీల్డింగ్ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. అయితే.. వారికి అంపైర్ షాకిచ్చాడు.

County Championship Shoaib Bashir survives as Kyle Abbotts towel falls during Delivery Stride
క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా అలాంటి ఘటననే కౌంటీ ఛాంపియన్ షిప్ 2024-2025లో చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో బౌలర్‌తో పాటు ఫీల్డింగ్ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. అయితే.. వారికి అంపైర్ షాకిచ్చాడు. బ్యాటర్ ఔట్ కాదని చెప్పాడు. నాటౌట్ ఇచ్చాడు. పోనీ అది నోబాలా అంటే అది కాదు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి అంపైర్ నాటౌట్ ఇవ్వడానికి కారణం ఏంటో చూద్దాం.
కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్ మ్యాచ్‌లో భాగంగా సోమర్‌సెట్, హాంప్‌షైర్ లు తలపడ్డాయి. సోమర్‌సెట్ తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే ఆలౌటైంది. హాంప్‌షైర్ బౌలర్ కైల్ అబాట్ నాలుగు వికెట్లతో మెరిశాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో సోమర్ సెట్ బ్యాటర్ షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే.. అంపైర్ దాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు.
SL vs NZ : 2, 9, 7, 8, 10, 13, 1, 0, 29, 2, 2.. ఏందన్నా ఇదీ న్యూజిలాండ్ ఫోన్ నెంబర్!
కైల్ అబాట్ బౌలింగ్‌లో షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే.. బంతి వేసేటప్పుడు కైల్ అబాట్ తన దగ్గర పెట్టుకున్న టవల్ కాస్త కిందపడిపోయింది. ఈ విషయాన్ని బ్యాటర్ అంపైర్ దృష్టికి తీసుకువెళ్లాడు. తన దృష్టి మరలిందని చెప్పాడు. ఇందుకు అంగీకరించిన అంపైర్ దాన్ని డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. దీంతో బషీర్ నాటౌట్‌గా బ్యాటింగ్‌ను కొనసాగించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను కౌంటీ ఛాంపియన్‌షిప్ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కైల్ అబాట్ రెండు బంతుల్లో దాదాపు రెండు వికెట్లు సాధించాడు. కానీ అతడు బాల్ వేస్తున్న క్రమంలో అతడి వెనుక జేబులోంచి టవల్ పడిపోయింది. అది డెడ్‌బాల్‌గా పరిగణించబడుతుంది అని రాసుకొచ్చింది.
IND vs BAN : భారత అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. మైదానం నుంచి హోటల్‌కు వెళ్లిపోయిన టీమ్ఇండియా..
తనకు వచ్చిన అవకాశాన్ని బషీర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అదే ఓవర్‌లో అబాట్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో సోమర్‌సెట్ ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో హాంప్‌షైర్ 196 పరుగులు చేసింది. దీంతో 60 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
Kyle Abbott nearly had two wickets in two balls…
But a towel fell out of Abbott’s back pocket in his delivery stride, and it was deemed a dead ball. pic.twitter.com/9jTYDoABfk
— Vitality County Championship (@CountyChamp) September 26, 2024