IND vs BAN : భార‌త అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌.. మైదానం నుంచి హోట‌ల్‌కు వెళ్లిపోయిన టీమ్ఇండియా..

బంగ్లాదేశ్‌ను క్లీన్ స్వీప్ చేయాల‌ని భావిస్తున్న భార‌త జ‌ట్టు ఆశ‌ల‌పై వ‌రుణుడు నీళ్లు చ‌ల్లుతున్నాడు.

IND vs BAN : భార‌త అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌.. మైదానం నుంచి హోట‌ల్‌కు వెళ్లిపోయిన టీమ్ఇండియా..

IND vs BAN 2nd Test Day 2 Team India return to hotel

Updated On : September 28, 2024 / 11:13 AM IST

IND vs BAN : బంగ్లాదేశ్‌ను క్లీన్ స్వీప్ చేయాల‌ని భావిస్తున్న భార‌త జ‌ట్టు ఆశ‌ల‌పై వ‌రుణుడు నీళ్లు చ‌ల్లుతున్నాడు. కాన్పూర్ వేదిక‌గా భార‌త్, బంగ్లాదేశ్ జ‌ట్లు రెండో టెస్టు మ్యాచులో త‌ల‌ప‌డుతున్నాయి. తొలి రోజు వ‌రుణుడి కార‌ణంగా కేవ‌లం 35 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది. దీంతో రెండో రోజు (శ‌నివారం) మ్యాచ్‌ను అరగంట ముందు ప్రారంభిచాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. రెండో రోజు మ్యాచ్ అనుకున్న స‌మ‌యానికి ప్రారంభం కాలేదు.

భారీ వ‌ర్షం కార‌ణంగా మైదానం మొత్తాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచారు. ఇరు జ‌ట్లు స్టేడియానికి చేరుకున్నాయి. అయితే.. గంట‌కు పైగా వేచి చూసిన భార‌త జ‌ట్టు తిరిగి హోట‌ల్‌కు వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

IND vs BAN : బంగ్లాదేశ్ కెప్టెన్ న‌జ్ముల్ వికెట్ కోసం అశ్విన్ సూప‌ర్ ప్లాన్ : దినేశ్ కార్తిక్‌

భార‌త జ‌ట్టు మైదానాన్ని వీడి హోట‌ల్‌కు వెళ్లిపోవ‌డంతో నేడు (శ‌నివారం) మ్యాచ్ జ‌ర‌గ‌డం క‌ష్ట‌మేన‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ మొద‌ట బ్యాటింగ్ చేస్తోంది. ఇక తొలి రోజు కేవ‌లం 35 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది. బంగ్లా మూడు వికెట్ల న‌ష్టానికి 103 ప‌రుగులు చేసింది. మోమినుల్ హక్ (40), ముష్ఫికర్ రహీమ్ (6)లు క్రీజులో ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీశాడు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

Rishabh pant : వికెట్ల వెనకాల పంత్ జోకులు.. సునీల్ గవాస్కర్ ఏం చేశారంటే..