IND vs BAN : బంగ్లాదేశ్ కెప్టెన్ న‌జ్ముల్ వికెట్ కోసం అశ్విన్ సూప‌ర్ ప్లాన్ : దినేశ్ కార్తిక్‌

వ‌ర్షం కార‌ణంగా కాన్పూర్ వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ఆటంకాలు ఏర్ప‌డుతున్నాయి.

IND vs BAN : బంగ్లాదేశ్ కెప్టెన్ న‌జ్ముల్ వికెట్ కోసం అశ్విన్ సూప‌ర్ ప్లాన్ : దినేశ్ కార్తిక్‌

Ashwin mastermind planning for Nazmul wicket says Dinesh Karthik

Updated On : September 28, 2024 / 10:27 AM IST

వ‌ర్షం కార‌ణంగా కాన్పూర్ వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ఆటంకాలు ఏర్ప‌డుతున్నాయి. తొలి రోజు కేవ‌లం 35 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది. భార‌త బౌల‌ర్లు ధాటికి బంగ్లాదేశ్‌ మూడు వికెట్లు కోల్పోయింది. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో ఆకాశ్ దీప్ రెండు వికెట్ల‌ను తీశాడు. రవిచంద్ర‌న్ అశ్విన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

కాగా.. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ను అశ్విన్ ఎల్బీగా ఔట్ చేశాడు. 57 బంతులు ఎదుర్కొన్న శాంటో 31 ప‌రుగులు చేశాడు. అత‌డిని అశ్విన్ బోల్తా కొట్టించిన విధానంపై టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు దినేశ్‌ కార్తిక్ ప్ర‌శంసించాడు. షాట్ కొట్టేందుకు య‌త్నించిన షాంటో బంతిని స‌రిగ్గా అంచ‌నా వేయ‌లేక‌పోయాడు. దీంతో ఎల్బీగా ఔట్ అయిపోయాడు.

Rishabh pant : వికెట్ల వెనకాల పంత్ జోకులు.. సునీల్ గవాస్కర్ ఏం చేశారంటే..

‘కాన్పూర్ పిచ్ పై బౌన్స్ అంత‌గా ఉండ‌దు. చాలా త‌క్కువ ఎత్తులో బాల్ వ‌స్తుంది. ఇక లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట‌ర్ల‌కు ఎలాంటి బంతులు వేయాలో అశ్విన్‌కు చాలా చ‌క్క‌గా తెలుసు. ఎడ‌మ‌చేతి వాటం బ్యాట‌ర్లు ఎక్కువ‌గా ఆఫ్ స్పిన్‌ను అంచ‌నా వేసి ఆడుతారు. అయితే.. అశ్విన్ వారికి టర్న్ లేకుండా నేరుగా వికెట్ల పైకి దూసుకువెళ్లేలా బంతుల‌ను సంధిస్తాడు. దీంతో ప్ర‌త్య‌ర్థి అయోమ‌యానికి గురి కావాల్సి వ‌స్తుంది.’ అని కార్తిక్ అన్నాడు.

ఇక త‌న కెరీర్‌లో ఇలా చేసి ఎన్నో వికెట్ల‌ను అశ్విన్ సాధించాడని చెప్పుకొచ్చాడు. శాంటో విష‌యంలోనూ అదే జ‌రిగిందన్నాడు. త‌న బౌలింగ్‌లో ప‌రుగులు రాబ‌ట్టాడ‌ని శాంటో ఉన్నాడ‌నే విష‌యం అశ్విన్‌కు అర్థ‌మైందని, దీంతో స్వీప్ లేదా డిఫెన్స్ మాత్ర‌మే ఆడేలా అశ్విన్ బంతుల‌ను సంధించాడన్నారు. ఆఫ్ స్పిన్‌కు బ‌దులు వికెట్ల‌ను ల‌క్ష్యంగా బంతుల‌ను వేయ‌డంతో శాంటో దొరికిపోయాడు. మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలోనే అది ప్లంబ్ ఎల్బీ అని చెప్పాను. రివ్యూ కూడా వృథా అవుతుంద‌నుకున్నా.. అలాగే జ‌రిగింది అని దినేశ్ కార్తిక్ తెలిపాడు.

MS Dhoni : ధోనీ కొత్త లుక్.. బైక్‌ను ఎంత స్టైల్‌గా న‌డుపుతున్నాడో చూశారా.. వీడియో వైర‌ల్