MS Dhoni : ధోనీ కొత్త లుక్.. బైక్‌ను ఎంత స్టైల్‌గా నడుపుతున్నాడో చూశారా.. వీడియో వైరల్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. తనకు వీలుచిక్కినప్పుడల్లా బైక్ రైడింగ్ చేస్తూ కనిపిస్తుంటాడు. తాజాగా..

MS Dhoni
MS Dhoni Bike Ride on Ranchi streets Video goes viral: టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. తనకు వీలుచిక్కినప్పుడల్లా బైక్ రైడింగ్ చేస్తూ కనిపిస్తుంటాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి. తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ పొడవాటి జుట్టుతో బైక్ రైడింగ్ చేస్తూ కొత్త లుక్ లో కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : Rishabh pant : వికెట్ల వెనకాల పంత్ జోకులు.. సునీల్ గవాస్కర్ ఏం చేశారంటే..
మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చిన ధోనీ తన సొంత పట్టణం రాంచీలో ఉంటున్నాడు. ఈ క్రమంలో రాంచీలో బైక్ పై రిలాక్స్ గా కనిపించాడు. అతను పొడవాటి జట్టుతో సరికొత్త లుక్ లో కనిపించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ధోనీ పొడవాటి జట్టుతో చాలా కూల్ గా స్టైలిస్ గా బైక్ నడుపుతూ యూ-టర్న్ తీసుకున్నట్లు చూడొచ్చు. ఈ వీడియోను తిలకించిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో చెన్నై జట్టుకు ఆడుతున్నాడు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్ కు ముందే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతుంది. నివేదికల ప్రకారం.. బీసీసీఐ రిటైర్డ్ అంతర్జాతీయ ఆటగాళ్లను అన్ క్యాప్డ్ కేటగిరీలో ఉంచే కొత్త ప్రణాళికను పరిశీలిస్తోంది. ఇదే జరిగితే ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనే కొనసాగే అవకాశం ఉంది.
MS DHONI – THE RIDER. 😎 ⚡
Dhoni enjoying the time at his hometown. pic.twitter.com/yF5y3nvY6A
— Johns. (@CricCrazyJohns) September 27, 2024