కోహ్లికి కొడుకు పుట్టాడ‌ని తెలిసి.. పాకిస్తాన్‌లో ఏం చేశారో తెలుసా?

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

Virat Kohli Fans : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇటీవ‌ల‌ విరాట్ కోహ్లి-అనుష్క శ‌ర్మ దంప‌తులు మ‌రోసారి త‌ల్లిదండ్రులైన సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 15న అనుష్క శ‌ర్మ పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని కోహ్లి దంప‌తులు మంగ‌ళ‌వారం అభిమానుల‌తో పంచుకున్నారు. త‌మ కుమారుడికి అకాయ్ అని పేరును పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు.

విరాట్ కి కొడుకు పుట్ట‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోహ్లి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల పెద్ద ఎత్తున వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇక పాకిస్తాన్‌లో సైతం అభిమానులు సంబ‌రాలు చేసుకోవ‌డం విశేషం. స్వీట్లు పంచుతూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. జూనియ‌ర్ కోహ్లి తండ్రి బాట‌లోనే ప‌య‌నించాల‌ని, అత‌డి రికార్డును బ‌ద్ద‌లు కొట్టాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Virat Kohli son Akaay : ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ అయిన విరాట్ కొడుకు.. 24 గంటల్లో ఏం జరిగిందో తెలుసా?

‘మా కుమారుడు అకాయ్‌ను ఫిబ్ర‌వ‌రి 15న ఈ లోకంలోకి స్వాగ‌తించాం. మా జీవితంలోనే అత్యంత మ‌ధుర‌మైన ఈ స‌మ‌యంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్ష‌ల‌ను కోరుకుంటున్నాము. మా వ్య‌క్తిగ‌త గోప్య‌త‌ను గౌర‌వించాల‌ని కోరుకుంటున్నాం. ‘అని మంగ‌ళ‌వారం అకాయ్ గురించి వెల్ల‌డించే స‌మ‌యంలో కోహ్లి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

అకాయ్‌కు అర్థం ఏంటో తెలుసా..?
కోహ్లి త‌న కుమారుడికి అకాయ్ అని నాయ‌క‌ర‌ణం చేయ‌డంతో ఈ పేరుకు ఉన్న అర్థ‌మేమిటో తెలుసుకోవాల‌ని చాలా మంది భావిస్తున్నారు. దీనికి నిపుణులు రెండు ర‌కాల అర్థాలను చెబుతున్నారు. సంస్కృతంలో ఈ ప‌దానికి అమ‌రుడు, చిరంజీవుడు అని అర్థం వ‌స్తుంది. అలాగే హిందీలో కాయ్ అంటే శ‌రీరం అని.. అకాయ్ అంటే భౌతిక శ‌రీరానికి మించిన వాడు అని అర్థం వ‌స్తుంది.

ట‌ర్కీ భాష‌లో తీసుకుంటే అకాయ్ అంటే ‘ప్ర‌కాశిస్తున్న చంద్రుడు’ అని అర్థం కూడా వ‌స్తుంది. ఈ రెండు అర్థాల‌లో విరుష్క జంట త‌మ కుమారుడికి నామ‌క‌ర‌ణం చేశారో చెప్పాల్సి ఉంది. ఇదిలా ఉంటే విరుష్క జంట‌కు ఇప్ప‌టికే మూడేళ్ల కుమారై వామిక ఉంది.

ట్రెండింగ్ వార్తలు