Virat Kohli Anushka Sharma
Virushka: సెలబ్రెటీలు కూడా మనుషులే అన్న సంగతిని కొందరు మరిచిపోతుంటారు. సెలబ్రెటీలు కనిపించింది ఆలస్యం సెల్ఫీలు, వీడియోలు అంటూ వారిని ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అన్నిసార్లు కాకపోయినా అభిమానుల చేష్టల కారణంగా సెలబ్రెటీలు సహనం కోల్పోయిన ఘటనలను మనం పలు సందర్భాల్లో చూశాం. ఇక విరుష్క (విరాట్ కోహ్లి-అనుష్క) జంటకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇటీవల వీరిద్దరు కలిసి బెంగళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అక్కడున్న వారికి తెలిసింది. విరాట్ కోహ్లి, అనుష్క శర్మను చూసి, వారితో సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున అభిమానులు సదరు రెస్టారెంటు వద్దకు చేరుకున్నారు. భోజనం ముగించుకున్న అనంతరం విరుష్క జంట బయటకు వచ్చి కారు ఎక్కేందుకు వీలు లేకుండా పోయింది. భద్రతా సిబ్బంది అభిమానులను నిలవరించేందుకు ప్రయత్నించినా, ఈ జంట తమ కారు వద్దకు వెళ్లేందుకు చాలా కష్టపడ్డారు.
Virat Kohli got mobbed in Bengaluru ?❤️? after lunch date with Anushka nd family . pic.twitter.com/JYHNtDaYMo
— “ (@KohlifiedGal) April 22, 2023
ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విరుష్క జంట బయటకు రాగానే సెల్ఫీల కోసం అభిమానులు పోటీపడ్డారు. ఇంతలో ఓ వ్యక్తి అనుష్కతో సెల్ఫీ కోసం చాలా దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశాడు. అనుష్క శర్మ కారు డోరును కూడా తెరవడానికి స్థలం లేకపోయింది. వెంటనే పక్కనే కోహ్లి అతడిని వారించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విరాట్ తన సహనం కోల్పోవడాన్ని చూడొచ్చు. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. విరుష్క జంటకు ప్రైవసీ లేకుండా చేస్తున్నారంటూ కొందరు విరాట్‌కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.