Virat Kohli: సచిన్ తర్వాత కోహ్లినే.. ‘కింగ్’ మరో ఘనత

రన్ మెషీన్ గా అభిమానులు పిలుచుకునే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఖాతాలోకి మరో రికార్డు చేరింది.

Virat Kohli Record: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రికార్డుల సిరీస్ కొనసాగుతోంది. శ్రీలంక జట్టుపై 4000 ప్లస్ పరుగులు చేసిన రెండో ప్లేయర్ గా కింగ్ కోహ్లి నిలిచాడు. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. కోహ్లి కంటే ముందున్నాడు. శ్రీలంకపై 109 మ్యాచ్ లు ఆడిన సచిన్ 49.11 సగటుతో 5108 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లి కేవలం 72 మ్యాచ్ లు ఆడి 4000 ప్లస్ స్కోరు సాధించాడు.

ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాపై 110 మ్యాచుల్లో 6707 పరుగులు చేసిన సచిన్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాపై 95 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 5149 పరుగులు చేశాడు. కాగా, కేలండర్ ఇయర్ లో ఎక్కువ సార్లు 1000 ప్లస్ పరుగులు చేసిన రికార్డును తాజా కోహ్లి బ్రేక్ చేశాడు. ఈ ఫీట్ ను కోహ్లి 8 సార్లు సాధించగా, సచిన్ ఏడుసార్లు నమోదు చేశాడు.

కాగా, వన్డే ప్రపంచకప్ లో శ్రీలంకతో మ్యాచ్ లో కోహ్లి 94 బంతుల్లో 11 ఫోర్లతో 88 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 288 వన్డేలు ఆడిన కోహ్లి 58.05 సగటుతో 13525 పరుగులు చేశాడు. ఇందులో 48 సెంచరీలు, 70 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Also Read: ఆ రెండు జట్లకు కలిసొచ్చిన న్యూజిలాండ్ ఓటమి.. సెమీస్ లోకి పాకిస్థాన్ ఎంట్రీ ఖాయమా?