మూడేళ్లుగా అదే రోజు: సెంచరీలతో మెరిపిస్తున్నకోహ్లీ

సెంటిమెంట్‌లు ఎక్కడైనా పని చేస్తాయనడానికి ఉదహరణగా కోహ్లీ సెంచరీలే చాటి చెప్తున్నాయి. సరిగ్గా జనవరి 15వ తేదినే సెంచరీలు నమోదు చేస్తూ అభిమానులను సంతోషంతో ముంచెత్తుతున్నాడు కెప్టెన్.

  • Published By: veegamteam ,Published On : January 16, 2019 / 12:01 PM IST
మూడేళ్లుగా అదే రోజు: సెంచరీలతో మెరిపిస్తున్నకోహ్లీ

Updated On : January 16, 2019 / 12:01 PM IST

సెంటిమెంట్‌లు ఎక్కడైనా పని చేస్తాయనడానికి ఉదహరణగా కోహ్లీ సెంచరీలే చాటి చెప్తున్నాయి. సరిగ్గా జనవరి 15వ తేదినే సెంచరీలు నమోదు చేస్తూ అభిమానులను సంతోషంతో ముంచెత్తుతున్నాడు కెప్టెన్.

సెంటిమెంట్‌లు ఎక్కడైనా పని చేస్తాయనడానికి నిదర్శనంగా కోహ్లీ సెంచరీలే నిలుస్తున్నాయి. సరిగ్గా జనవరి 15వ తేదినే సెంచరీలు నమోదు చేస్తూ అభిమానులను సంతోషంతో ముంచెత్తుతున్నాడు కెప్టెన్. వరుసగా 2017, 18, 19 సంవత్సరాల్లో అదే తేదీల్లో సెంచరీలు బాదేశాడు. అయితే ఆ సెంచరీలు జట్టు జయాపజయాలకు అతీతంగా ఉండటం గమనార్హం.

2017 జనవరి 15న భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య పుణె వేదికగా వన్డే మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 105 బంతుల్లో 122 పరుగులు చేసి వన్డే కెరీర్‌లో 27వ సెంచరీని నమోదుచేశాడు. అంతేగాక, ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌తో అద్భుత భాగస్వామ్యం నమోదు చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి(122)తో పాటు జాదవ్‌(120) సెంచరీ సాధించడంతో  ఇంగ్లాండ్‌పై టీమిండియా 351 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా11 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇక 2018 జనవరి 13-17 తేదీల్లో సెంచూరియా వేదికగా దక్షిణాఫ్రికా, ఇండియాల మధ్య టెస్టు సిరీస్‌ జరిగింది. ఇందులో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌‌లో మూడో రోజైన జనవరి 15న కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో కోహ్లీ 153 పరుగులు చేశాడు. ఆ ఏడాది కోహ్లీకిదే తొలి సెంచరీ. అయితే ఈ సెంచరీ మ్యాచ్‌కు ఏ మాత్రం లాభం లేకుండా వృథాగానే ముగిసింది. ఆ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైంది. 

తాజాగా 2019 జనవరి 15న(మంగళవారం) అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాపై కోహ్లీ 104 పరుగులు చేశాడు. ఇలా రెండో వన్డేలో కోహ్లి కెరీర్‌లో 39వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ సెంచరీ ఆసీస్‌పై 6వది కాగా.. ఛేజింగ్‌లో 24వది కావడం విశేషం. మూడేళ్లుగా కోహ్లీ ఏడాదిలో తన తొలి సెంచరీని జనవరి 15వ తేదీనే సాధించడంతో అటు అభిమానులు కూడా సోషల్‌మీడియా వేదికగా ప్రత్యేకతను చెప్తూ కెప్టెన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.