Virat Kohli : రీ ఎంట్రీ మ్యాచులో మూడు రికార్డుల పై కోహ్లీ క‌న్ను.. ఎన్ని అందుకుంటాడో మ‌రీ..!

ఇండోర్ వేదిక‌గా ఆదివారం భార‌త్, అఫ్గానిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య రెండో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Virat Kohli : ఇండోర్ వేదిక‌గా ఆదివారం భార‌త్, అఫ్గానిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య రెండో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ ద్వారా టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌లో 14 నెల‌ల త‌రువాత పున‌రాగ‌మ‌నం చేయ‌నున్నాడు. అఫ్గానిస్తాన్‌తో మొద‌టి మ్యాచ్‌కు విరాట్ ఎంపికైన‌ప్ప‌టికీ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో అత‌డు ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కాగా.. రీ ఎంట్రీ మ్యాచ్‌లో విరాట్ మూడు రికార్డులు అందుకునే అవ‌కాశం ఉంది.

– ప‌రుగుల యంత్రం కోహ్లీ టీ20 క్రికెట్‌లో 12వేల ప‌రుగుల మైలురాయిని చేరుకునేందుకు మ‌రో 35 ప‌రుగులు అవ‌స‌రం. ప్ర‌స్తుతం కోహ్లీ 11,965 ప‌రుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో 35 ప‌రుగులు చేస్తే 12 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న మొద‌టి భార‌తీయుడిగా, ఓవ‌రాల్‌గా నాలుగో ఆట‌గాడిగా నిల‌వ‌నున్నాడు.

టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

క్రిస్ గేల్ (వెస్టిండీస్‌) – 14562 ప‌రుగులు
షోయ‌బ్ మాలిక్ (పాకిస్తాన్‌) – 12993
కీర‌న్ పొలార్డ్ (వెస్టిండీస్‌) – 12390
విరాట్ కోహ్లీ (భార‌త్‌)- 11965
అలెక్స్ హేల్స్ (ఇంగ్లాండ్) -11736

Faf du Plessis : స్టన్నింగ్ క్యాచ్‌.. 39 ఏళ్ల వ‌య‌సులోనూ.. న‌మ్మ‌లేక‌పోతున్నాం.. వీడియో వైర‌ల్‌

– రెండో టీ20లో విరాట్ గ‌నుక హాఫ్ సెంచ‌రీ చేస్తే.. టీ20 క్రికెట్‌లో 100 సార్లు 50+స్కోర్లు చేసిన మూడో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు. ఈ జాబితాలో క్రిస్‌గేల్ 110 సార్లు 50+స్కోర్లు చేసి అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత డేవిడ్ వార్న‌ర్ 107 సార్లు ఈ ప్ర‌ద‌ర్శ‌న చేసి రెండవ స్థానంలో కొన‌సాగుతున్నాడు.

– విరాట్ మ‌రో 28 బంతులు ఎదుర్కొంటే టీ20 క్రికెట్‌లో 9 వేల బంతులు ఎదుర్కొన్న ఆట‌గాడిగా అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకోనున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక బంతులు ఆడిన పేయ‌ర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక బంతులు ఎదుర్కొన్న ఆట‌గాళ్లు..
షోయ‌బ్ మాలిక్ (పాకిస్తాన్‌) -10168
క్రిస్‌గేల్ (వెస్టిండీస్‌) – 10060
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 8972

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌కు అవ‌మానం..! ముంబై ఇండియ‌న్స్ పై మండిప‌డుతున్న ఫ్యాన్స్‌..

చూడాలి మ‌రీ విరాట్ కోహ్లీ ఈ మూడు రికార్డుల్లో ఎన్ని రికార్డును రెండో మ్యాచులో అందుకుంటాడో.

ట్రెండింగ్ వార్తలు