IPL 2022: శామ్ బిల్సింగ్స్ క్యాచ్ అందుకున్నాక కోహ్లీ మూతి మారిపోయిందలా..

శామ్ బిల్లింగ్స్ క్యాచ్ అందుకోగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లుక్ మారిపోయింది. మూతి దగ్గరకు తెచ్చుకుని బౌలర్ స్టైల్ లో ఫోజిచ్చాడు.

Sam Billings

IPL 2022: శామ్ బిల్లింగ్స్ క్యాచ్ అందుకోగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లుక్ మారిపోయింది. మూతి దగ్గరకు తెచ్చుకుని బౌలర్ స్టైల్ లో ఫోజిచ్చాడు. మార్చి 30న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ కు జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది.

శామ్ బిల్లింగ్స్ కొట్టడంతో చాలా సింపుల్ గా క్యాచ్ అందుకున్న కోహ్లీ.. చీకీ రియాక్షన్ కు సోషల్ మీడియాలో రెస్పాన్స్ భారీగానే వస్తుంది.

ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో బెంగళూరు జట్టు విజయం సాధించింది. టార్గెట్ చిన్నదే అయినా బెంగళూరు చెమటోడ్చాల్సి వచ్చింది. ఐపీఎల్ 2022 సీజన్ 15 లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడగా.. మూడు వికెట్ల తేడాతో కోల్ కతాను చిత్తు చేసింది.

Read Also: ఐపీఎల్‌కు రైనా రిటైర్మెంట్!!

కోల్ కతా చివరి వరకు పోరాడినా పరాజయం తప్పలేదు. కోల్ కతా నిర్దేశించిన 129 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు.. మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. 19.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి విక్టరీ కొట్టింది.