Suresh Raina: ఐపీఎల్‌కు రైనా రిటైర్మెంట్!!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ మధ్యలో సురేశ్ రైనా మొత్తం టోర్నీకే రిటైర్మెంట్ ప్రకటించనున్నాడట. సీజన్ మొదలుకావడానికి రెండ్రోజుల ముందే ధోనీ కెప్టెన్సీ పగ్గాలకు రాజీనామా..

Suresh Raina: ఐపీఎల్‌కు రైనా రిటైర్మెంట్!!

Suresh Raina

Suresh Raina: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ మధ్యలో సురేశ్ రైనా మొత్తం టోర్నీకే రిటైర్మెంట్ ప్రకటించనున్నాడట. సీజన్ మొదలుకావడానికి రెండ్రోజుల ముందే ధోనీ కెప్టెన్సీ పగ్గాలకు రాజీనామా ఇచ్చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజాను కెప్టెన్ గా అనౌన్స్ చేశారు.

ఇప్పుడు సురేశ్ రైనా తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన రోజే ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు రైనా. మిస్టర్ ఐపీఎల్ గా పిలిపించుకునే రైనాను రీసెంట్ గా ముగిసిన వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు.

ఐపీఎల్ లో 205గేమ్స్ ఆడిన రైనా.. 5వేల 528పరుగులు చేయగా.. అందులో ఒక సెంచరీ, 39హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక తాను క్రికెటర్ గా కెరీర్ ముగించి ఐపీఎల్ 2022లోనే కామెంటేటర్ గా కెరీర్ స్టార్ట్ చేయనున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Read Also: ‘ధోనీ విధేయత కోల్పోయాడు కాబట్టే రైనాను కొనలేదు’

గతేడాది అన్ని ఫార్మాట్ల నుంచి హర్భజన్ సింగ్ వీడ్కోలు పలికినట్లుగా రైనా కూడా ఐపీఎల్ 2022 మధ్యలోనే ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడని సమాచారం.

ప్రస్తుతం ఐపీఎల్ 15వ ఎడిషన్ కు గానూ ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మరాఠీ, మళయాళం, బెంగాలీ, గుజరాతీ భాషలకు గానూ 85మంది కామెంటేటర్లు ఉన్నారు. రవిశాస్త్రి కూడా కామెంటేటర్ గా రీఎంట్రీ ఇవ్వడంతో సురేశ్ రైనా, పీయీశ్ చావ్లా, ధావల్ కుల్కర్ణి, హర్భజన్ సింగ్ లు కామెంటేటర్లుగా ఎంట్రీ ఇచ్చేందుకు కాలు దువుతున్నారు.

ఒకవేళ సురేశ్ రైనా.. కామెంటేటర్ ప్యానెల్ కు వెళ్లదలిస్తే హిందీ ప్యానెల్ కే వెళ్తాడట. ఐపీఎల్ లో 2008 నుంచి భాగంగా ఉన్న నేను.. కొత్త పని ఎంచుకోవడంలో ఎగ్జైటింగ్ గా ణ్నాను. స్టార్ స్పోర్ట్స్ కోసం రెడీ అవుతున్న హిందీ కామెంటరీ ప్యానెల్ లో భాగం కానున్నా’ అంటూ రైనా అనౌన్స్ చేశాడు.