IPL 2022: ‘ధోనీ విధేయత కోల్పోయాడు కాబట్టే రైనాను కొనలేదు’

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆరంభం నుంచి రైనా గైర్హాజరవడం ఇదే తొలిసారి. 2020లో వ్యక్తిగత కారణాల రీత్యా లీగ్ కు దూరం కాగా, 2022 సీజన్‌కు అస్సలు కొనుగోలు కాకుండానే..

IPL 2022: ‘ధోనీ విధేయత కోల్పోయాడు కాబట్టే రైనాను కొనలేదు’

Raina

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభమైనప్పటి నుంచి సీజన్‌ మొత్తం గైర్హాజరీ కావడం సురేశ్ రైనాకి ఇదే తొలిసారి. 2020లో వ్యక్తిగత కారణాల రీత్యా లీగ్ కు దూరం కాగా, ప్రస్తుత సీజన్ కు కొనుగోలు చేయకుండా చెన్నై సూపర్ కింగ్స్ అతణ్ని దూరం పెట్టింది. ఆరంభ సీజన్ నుంచి సీఎస్కేతో పాటే కొనసాగుతున్న రైనాను కొనుగోలు చేయకపోవడానికి వెనుక కారణాన్ని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇలా వివరించాడు.

2021 ఎడిషన్‌లో రైనా ఫామ్ కనబరచలేకపోయాడు. మోకాలి గాయం కారణంగా టోర్నమెంట్ చివరి మ్యాచ్ లలోనూ ఆడలేకపోయాడు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ CSKతో పాటు ఇతర జట్లు కూడా పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చు.

“UAEలో మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో విధేయతను కోల్పోయే విధంగా ప్రవర్తించాడు. దాని గురించి తగినంత ఊహాగానాలు ఉన్నాయి. జట్టుతో పాటు కెప్టెన్ MS ధోని విధేయతను కోల్పోవడంతో అవకాశాలు తగ్గిపోయినట్లు కనిపిస్తున్నాయి” అని ఒక ఇంగ్లీష్ మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు.

IPL 2022: రైనాను సీఎస్కే తీసుకోకపోవడానికి కారణమిదే

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడని రైనా ఫిట్‌గా లేడని, ప్రారంభ ధర చాలా ఎక్కువగా ఉందని అది కూడా ఒక కారణమే అయి ఉండొచ్చని అన్నాడు. రైనాను తీసుకోకపోవడంపై జట్టు మేనేజర్ శ్రీనివాసన్ కూడా ఫామ్ లేకపోవడమే కారణమని చెప్పాడు.

రైనా ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలో (205 మ్యాచ్‌ల్లో 5,528 పరుగులు) అత్యధిక పరుగులు చేసిన నాలుగో స్థానంలో ఉన్నాడు.

IPL 2022: వేలం మొత్తంలో కొనుగోలు కాకుండా మిగిలిపోయిన ప్లేయర్లు