IPL 2022: రైనాను సీఎస్కే తీసుకోకపోవడానికి కారణమిదే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం 2022లో సురేశ్ రైనాను కొనుగోలు చేయలేదు. చెన్నై సూపర్ కింగ్స్ వేలానికి విడిచిపెట్టాక రెండ్రోజుల వేలంలో ఏ జట్టూ ఆసక్తి కనబరచలేదు. 2008 నుంచి 2015వరకూ.

IPL 2022: రైనాను సీఎస్కే తీసుకోకపోవడానికి కారణమిదే

Suresh Raina

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం 2022లో సురేశ్ రైనాను కొనుగోలు చేయలేదు. చెన్నై సూపర్ కింగ్స్ వేలానికి విడిచిపెట్టాక రెండ్రోజుల వేలంలో ఏ జట్టూ ఆసక్తి కనబరచలేదు. 2008 నుంచి 2015వరకూ, 2018 నుంచి 2021వరకూ జట్టుతోనే ఉన్న రైనాను తీసుకోకపోవడంపై జట్టు సీఈఓ విశ్వనాథ్ వివరణ ఇచ్చారు.

ఐపీఎల్ చరిత్రలో నాలుగో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా 205 గేమ్స్ ఆడి 5వేల 528పరుగులు సాధించాడు. సీఎస్కే కోసమే 4వేల 687పరుగులు నమోదుచేశాడు. యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడిన సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ రెస్పాన్స్ ఇలా ఉంది.

’12ఏళ్లుగా జట్టుతో స్థిరంగా కొనసాగుతున్న వారిలో రైనా ఒకరు. వేలానికి వదిలేయడం మాకు కష్టంగానే అనిపించింది. అదే సమయంలో టీం అడ్జస్ట్‌మెంట్స్ కూడా ఆలోచించాలి కదా. టీం కంపోజిషన్ అనేది ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ టీమ్ అయినా అదే కదా చేసేది’

‘అందుకే అతను జట్టులోకి సరిపోడేమోనని తీసుకోలేదు’ అని వివరించాడు.

IPL 2022: వేలం తర్వాత చెన్నై పూర్తి జట్టు వివరాలివే

ఐపీఎల్ 2022వేలంలో సీఎస్కే అంబటి రాయుడు రూ.6.75కోట్లు, డేన్ బ్రావో రూ.4.40కోట్లకు, ఊతప్పలను రూ.2కోట్లకు కొనుగోలు చేసింది.

మరో వైపు డుప్లెసిస్ ను ఎంపిక చేయకపోవడంపైనా సీఈఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. టైటిల్ గెలిచిన ధోనీ జట్టులో కీలకంగా వ్యవహరించిన డుప్లెసిస్ ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ‘మేం అతణ్ని మిస్ అవుతున్నాం. దశాబ్ద కాలంగా మాతో పాటే ఉన్నాడు. వేలం ప్రక్రియ అలాగే జరుగుతుంది’ అని అన్నాడు.