IPL 2022: వేలం తర్వాత చెన్నై పూర్తి జట్టు వివరాలివే

రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా పది ఫ్రాంచైజీలకు జట్లలో భారీ మార్పులు కనిపించాయి.

IPL 2022: వేలం తర్వాత చెన్నై పూర్తి జట్టు వివరాలివే

Csk (1)

Updated On : February 14, 2022 / 7:40 AM IST

IPL 2022: రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా పది ఫ్రాంచైజీలకు జట్లలో భారీ మార్పులు కనిపించాయి. చెన్నై జట్టు చిన్న తలా సురేశ్ రైనాను కొనుగోలు చేయకుండానే వదిలిపెట్టేసింది. మొత్తం 15దేశాలకు చెందిన 600ప్లేయర్లను 217స్లాట్ల కోసం వేలం నిర్వహించారు.

కాకపోతే 204ప్లేయర్లు (67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) వేలం ప్రక్రియను రూ.551.70కోట్లకు పూర్తి చేశారు. వేలంలో ఇషాన్ కిషన్ రూ.15.25కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత దీపక్ చాహర్ రూ.14కోట్లుకు కెప్టెన్ ఎంఎస్ ధోనీ కంటే ఎక్కువ ధర పలికాడు. విదేశీ ప్లేయర్లలో లియామ్ లివింగ్ స్టోన్ కోసం రూ.11.50కోట్ల వరకూ వెచ్చించి కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.

Chennai Super Kings:
అంటిపెట్టుకున్న ప్లేయర్లు:
రవీంద్ర జడేజా (రూ. 16 కోట్లు), ఎంఎస్ ధోని (రూ. 12 కోట్లు), మొయిన్ అలీ (రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ. 6 కోట్లు)

Read Also : ఉత్తర్ ప్రదేశ్ లో ప్రారంభమైన రెండో దశ పోలింగ్

వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్లు:
దీపక్ చాహర్ (రూ. 14 కోట్లు), డ్వేన్ బ్రావో (రూ. 4.4 కోట్లు), రాబిన్ ఉతప్ప (రూ. 2 కోట్లు), అంబటి రాయుడు (రూ. 6.75 కోట్లు), కెఎమ్ ఆసిఫ్ (రూ. 20 లక్షలు), తుషార్ దేశ్‌పాండే (రూ. 20 లక్షలు), శివమ్ దూబే (రూ. 4 కోట్లు), మహేశ్ తీక్షణ (రూ. 70 లక్షలు). రాజవర్ధన్ హంగర్గేకర్ (రూ. 1.5 కోట్లు), సిమర్‌జీత్ సింగ్ (రూ. 20 లక్షలు), డెవాన్ కాన్వే (రూ. 1 కోటి), మిచెల్ సాంట్నర్ (రూ. 1.90 కోట్లు), ఆడమ్ మిల్నే (రూ. 1.9 కోట్లు), సుభ్రాంశు సేనాపతి (రూ. 20 లక్షలు), ముఖేష్ చౌదరి (రూ. 20 లక్షలు), ప్రశాంత్ సోలంకి (రూ. 1.20 కోట్లు), డ్వేన్ ప్రిటోరియస్ (రూ. 50 లక్షలు), ఎన్ జగదీషన్ (రూ. 20 లక్షలు), సి హరి నిశాంత్ (రూ. 20 లక్షలు), క్రిస్ జోర్డాన్ (రూ. 3.50 కోట్లు), భగత్ వర్మ (రూ. రూ. 20 లక్షలు).

మొత్తం ప్లేయర్ల వివరాలు: 25 మంది, విదేశీ ప్లేయర్ 8