Virat Kohli – Instagram: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్స్ సంఖ్య 256 మిలియన్లు. దీంతో అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టుకి రూ.11.45 కోట్లు తీసుకుంటాడని తాజాగా ఓ నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదించే వ్యక్తుల సెలబ్రిటీల జాబితాలో ఈ ఏడాది విరాట్ కోహ్లీ టాప్-20లో ఉన్నాడని, భారత్‌లో అగ్రస్థానంలో ఉన్నాడని ప్రచారం జరిగింది. దీనిపై కోహ్లీ ట్విట్టర్ (Twitter)లో స్పందించాడు.
జీవితంలో తనకు దక్కిన అన్ని సౌకర్యాలు, విషయాల పట్ల సదా కృతజ్ఞుడినని, రుణపడి ఉంటానని కోహ్లీ ట్వీట్ చేశాడు. తాను సామాజిక మాధ్యమాల ద్వారా సంపాదిస్తోన్న దాని గురించి జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని తెలిపాడు. మీకో దండం పెడతాను అన్నట్లు ఎమోజీ పెట్టాడు.
విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నువ్వు పేదవాడివని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావా? అని మీమ్స్ సృష్టిస్తున్నారు. పన్నులకు భయపడే కోహ్లీ ఈ ట్వీట్ చేశాడని కొందరు అంటున్నారు. కాగా, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే సంపాదన పట్ల కొన్ని సంస్థలు అంచనాలు వేసి నివేదికలు విడుదల చేస్తుంటాయి.
While I am grateful and indebted to all that I’ve received in life, the news that has been making rounds about my social media earnings is not true. ?
— Virat Kohli (@imVkohli) August 12, 2023
Income tax raid ka darr ?
— Babu Bhaiya (@Shahrcasm) August 12, 2023
wah kohli ji pic.twitter.com/IOozPQvOyW
— Kaajukatla (@kaajukatla) August 12, 2023
Video Viral: ఇలాగే ముందుకు వెళ్లి లెఫ్ట్ తీసుకుంటే ఏమొస్తుంది?: కారు ఆపి అడిగిన ధోనీ
International Lefthanders Day: ఎడమ చేతితో ప్రపంచం అబ్బురపడే విజయాలు సాధించింది వీరే..