×
Ad

Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ పై వ‌న్డేల్లో ఒకే ఒక భార‌తీయుడు..

వ‌న్డేల్లో న్యూజిలాండ్ పై అత్య‌ధిక ప‌రుగులు సాధించిన భార‌త ఆట‌గాడిగా విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డుల‌కు ఎక్కాడు.

Virat Kohli surpassed to become Indias highest run scorer against New Zealand in ODIs

  • రాజ్‌కోట్ వ‌న్డేలో కోహ్లీ అరుదైన రికార్డు
  • న్యూజిలాండ్ పై వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ప్లేయ‌ర్‌గా
  • స‌చిన్‌ను అధిగ‌మించి

Virat Kohli : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. భార‌త్, న్యూజిలాండ్ దేశాల మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌ల్లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఈ క్ర‌మంలో అత‌డు దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్‌ను అధిగ‌మించాడు. రాజ్‌కోట్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో రెండో వ‌న్డేలో అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

రాజ్‌కోట్ వ‌న్డేలో తొలి బంతికే ఫోర్ కొట్టిన కోహ్లీ (Virat Kohli).. స‌చిన్ ను అధిగ‌మించాడు. 42 మ్యాచ్‌ల్లో స‌చిన్ 1750 ప‌రుగులు చేయ‌గా.. కోహ్లీ 35 మ్యాచ్‌ల్లో అధిగ‌మించ‌డం గ‌మ‌నార్హం.

Richest Indian cricketers : 2025లో టాప్ 5 ధ‌న‌వంతులైన భారత క్రికెటర్లు ఎవరు?

ఇక ఓవ‌రాల్‌గా న్యూజిలాండ్ పై వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన బ్యాట‌ర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు రికీ పాంటింగ్ మాత్ర‌మే కోహ్లీ కన్నా ముందు ఉన్నాడు.

న్యూజిలాండ్ పై వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 51 మ్యాచ్‌ల్లో 1971 ప‌రుగులు
* విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 35 మ్యాచ్‌ల్లో 1751 * ప‌రుగులు
* స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్‌) – 42 మ్యాచ్‌ల్లో 1750 ప‌రుగులు
* స‌న‌త్ జ‌య‌సూర్య (శ్రీలంక‌) – 47 మ్యాచ్‌ల్లో 1519 ప‌రుగులు

ఇదిలా ఉంటే.. ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్ర‌స్థానానికి చేరుకున్నాడు. దాదాపు నాలుగేళ్ల త‌రువాత అత‌డు అగ్ర‌స్థానానికి చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. చివ‌రి సారిగా అత‌డు 2021లో టాప్‌-1గా నిలిచాడు.

David Warner : డేవిడ్ వార్న‌ర్ రెండో కూతురు బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ పిక్స్‌.. వైర‌ల్‌