Virat Kohli : కేఎల్ రాహుల్‌ కెప్టెన్సీపై కోహ్లీ షాకింగ్ కామెంట్స్..!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు.

Virat Kohli : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. అయితే మొదటిసారి ఇంటర్నేషనల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్‌కు చేదు అనుభవం ఎదురైంది. టీమిండియాకు కలిసొచ్చే గ్రౌండ్‌లో రాహుల్ సేన పరాజాయం పాలైంది. భారత జట్టుపై ప్రొటిస్‌ జట్టు 1-1తో సిరీస్‌ను సమం చేసింది. జనవరి 11 నుంచి సౌతాఫ్రికాతో మూడో టెస్టు ప్రారంభం కానుంది. తలో టెస్టులో విజయం సాధించిన ఇరు జట్లకు మూడో టెస్టు కీలకంగా మారింది.

ఈ సందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. రాహుల్ కెప్టెన్సీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సౌతాఫ్రికా వికెట్లపై కేఎల్ రాహుల్ ప్రయత్నాలు అద్భుతమైనవి.. కానీ, దక్షిణాఫ్రికా అద్భుత ప్రదర్శన చేసింది. రాహుల్ చేసిన ప్రయత్నాలన్నీ తాను చేశాడు. కొత్తగా చేయడానికి అక్కడే ఏమీ లేదన్నాడు కోహ్లీ.. రెండో టెస్టుకు తాను అందుబాటులో ఉండి ఉంటే.. మరో వ్యూహం ఏదైనా ప్రయత్నించి ఉండేవాడిని కావొచ్చు. ఏది ఏమైనా ఎవరి కెప్టెన్సీ వారిది అని కోహ్లీ కామెంట్స్ చేశాడు. తన ఫిట్ నెస్ విషయంపై అడిగిన ప్రశ్నకు .. నేను పూర్తి ఫిట్ నెస్ సాధించాను… కేప్ టౌన్ టెస్టుకు అందుబాటులోకి వస్తానని కోహ్లీ తెలిపాడు.

కోహ్లీ ఫాంలో లేడని, అతడు ఇంకా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ వస్తున్న విమర్శలపై కోహ్లీ స్పందించాడు. ఇలాంటి విమర్శలు నాకేమి కొత్త కాదులే.. ఎన్నో రోజులుగా ఇలాంటి మాటలు వింటున్నా.. విమర్శలు ఎక్కువగా చేస్తున్న సమయంలో కృంగిపోకుండా ఉండేందుకు ఒకనాటి నా విజయాలు, రికార్డులను గుర్తుచేసుకుంటానని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

జట్టుకు విజయం అందించడమే లక్ష్యంగా నా వ్యుహాలను అమలు చేస్తాను.. ఆ దిశగా జట్టును ముందుకు నడిపిస్తానని తెలిపాడు. సోషల్ మీడియాలో లేదా బయట ఎవరూ ఎలా నా గురించి విమర్శలు చేసినా అసలే పట్టించుకోను.. ప్రత్యేకించి నేను ఇక్కడ నిరూపించుకోవాల్సింది ఏమి లేదని కోహ్లీ స్పష్టం చేశాడు.

Read Also : Virat Kohli: ఆ ఫీట్ సాధిస్తే రాహుల్ ద్రవిడ్ స్థానంలో కోహ్లీ

ట్రెండింగ్ వార్తలు