Virat Kohli: తన ఫేవరెట్ సింగర్ శుభ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన విరాట్ కోహ్లీ.. అసలు కారణం అదేనట..

కెనడాకు చెందిన పంజాబీ గాయకుడు శుభ్‌ను కోహ్లీ తన ఇన్‌స్టా‌గ్రామ్ నుంచి అన్‌ఫాలో చేయడానికి ప్రధాన కారణం ఉంది. ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో వక్రీకరించిన భారతదేశ మ్యాప్ ను పోస్ట్ చేశాడు.

Virat Kohli and Shubh

Team India Cricket Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి తన అభిమాన గాయకుడు శుభ్‌ను అన్ ఫాలో చేశాడు. శుభ్ కెనడాకు చెందిన పంజాబీ గాయకుడు. శుభ్ ఒకప్పుడు కోహ్లీకి ఇష్టమైన గాయకుడు. ట్విటర్ లో 26ఏళ్ల యువకుడిపై కోహ్లీ గతంలో తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2023 సమయంలో విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్కశర్మ కూడా జిమ్ లో శుభ్ ఎలివేటెడ్ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోసైతం వైరల్ అయింది.

Ganesh Chaturthi 2023: విఘ్నేశ్వరుడి పూజలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. ఫొటోలు వైరల్..

శుభ్‌ను కోహ్లీ తన ఇన్‌స్టా‌గ్రామ్ నుంచి అన్ ఫాలో చేయడానికి ప్రధాన కారణం ఉంది. కెనడాకు చెందిన ఈ పంజాబీ సింగర్ ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో వక్రీకరించిన భారతదేశ మ్యాప్ ను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ లో పంజాబ్, హర్యానాలను ప్రత్యేక దేశాలుగా చూపించారు. శుభ్ ఈ పోస్టు తరువాత భారతదేశంలో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు సెలబ్రెటీలుసైతం శుభ్ పోస్టు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికితోడు అతను ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుదారుడని కూడా ఆరోపించారు.

Canada based Punjabi singer Shubh Instagram post

Virat Kohli : లుంగీ డ్యాన్స్ పాట‌కు విరాట్ కోహ్లీ స్టెప్పులు.. వీడియో వైర‌ల్‌

ఇదిలాఉంటే శుభ్ వాస్తవానికి ముంబైలో సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయినప్పటికీ అతను ఖలిస్తానీలకు మద్దతు ఇస్తున్నాడని పేర్కొంటూ బీజేపీ యువమోర్చా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దీనికితోడు శుభ్ తన ఇన్‌స్టా పోస్టుతో ముంబైలో నిరసనలకు దారితీసింది. శుభ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు తరువాత భారత్ కు చెందిన పలువురు ప్రముఖులు అతన్ని అన్ ఫాలో చేశారు. వారిలో విరాట్ కోహ్లీ కూడా ఒకరు.

ట్రెండింగ్ వార్తలు