Virat Kohli : వాట‌ర్‌ బాయ్‌గా మారిన కోహ్లీ.. వీడియో వైర‌ల్‌

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) డ్రింక్స్ బాయ్ అవ‌తారం ఎత్తాడు. ఆసియా క‌ప్ (Asia Cup) 2023లో సూప‌ర్-4 ద‌శ‌లో నామమాత్ర‌మైన మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్ తో త‌ల‌ప‌డుతోంది.

Virat Kohli Water Boy

Virat Kohli Water Boy : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) డ్రింక్స్ బాయ్ అవ‌తారం ఎత్తాడు. ఆసియా క‌ప్ (Asia Cup) 2023లో సూప‌ర్-4 ద‌శ‌లో నామమాత్ర‌మైన మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్ తో త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీకి మేనేజ్‌మెంట్ విశ్రాంతి నిచ్చింది. మ్యాచులో ఆడ‌ని కోహ్లీ డ‌గౌట్ లో కూర్చోన్నాడు. అంతేకాకుండా డ్రింక్స్ బాయ్ అవ‌తారం ఎత్తాడు. ఓవ‌ర్ల మ‌ధ్య‌లో అత‌డు మైదానంలో ఉన్న ఆట‌గాళ్ల‌కు వాట‌ర్ బాటిళ్లు, డ్రింక్స్ అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Chaminda Vaas: బుమ్రాలాంటి వారిని ఇన్ని ఫార్మాట్లలో ఆడించొద్దు.. ఎందుకంటే?: చమింద వాస్

విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయ‌ర్‌ ఇలా ఆట‌గాళ్ల‌కు మంచినీళ్లు, డ్రింక్స్ అందించ‌డం చూసిన నెటీజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఎంతో స్టార్‌డ‌మ్ క‌లిగిన విరాట్.. ఎలాంటి ఈగోల‌కు పోకుండా డ్రింక్స్ బాయ్‌గా మార‌డాన్ని ప్ర‌శంసిస్తున్నారు. ఆట ప‌ట్ల అత‌డికి ఉన్న అంకిత భావాన్ని తెలియ‌జేస్తుంద‌ని కామెంట్లు పెడుతున్నారు. అత్యంత ఖ‌రీదైన వాట‌ర్ బాయ్ అంటూ ఇంకొంద‌రు అంటున్నారు. కాగా.. విరాట్ కోహ్లీ ఆసియాక‌ప్‌లో పాకిస్తాన్‌పై శ‌త‌కంతో చెల‌రేగ‌గా శ్రీలంక‌తో మ్యాచ్‌లో విఫ‌లం అయ్యాడు.

ఐదు మార్పుల‌తో బ‌రిలోకి దిగిన టీమ్ఇండియా..

బంగ్లాదేశ్‌తో మ్యాచులో టీమ్ఇండియా ఏకంగా ఐదు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. ఇప్ప‌టికే ఆసియా క‌ప్ ఫైన‌ల్‌కు భార‌త్ చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ నామ‌మాత్రంగా మారింది. ఈ క్ర‌మంలో ఆట‌గాళ్ల‌పై ప‌ని భారం త‌గ్గించేందుకు గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తో పాటు విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, మ‌హ్మ‌ద్‌ సిరాజ్‌, కుల్దీప్ యాద‌వ్‌ల‌కు రెస్ట్ ఇచ్చింది. వీరి స్థానాల్లో సూర్య‌కుమార్ యాద‌వ్‌, శార్దూల్ ఠాకూర్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ల‌తో పాటు తెలుగు తేజం తిల‌క్ వ‌ర్మ‌ల‌కు ఛాన్స్ ద‌క్కింది. కాగా.. తిల‌క్ వ‌ర్మ‌ ఈ మ్యాచ్ ద్వారా వ‌న్డేల్లో అరంగ్రేటం చేశాడు.

Suryakumar Yadav turns 33 : టీ20ల్లో నంబ‌ర్ వ‌న్‌గా ఉన్న సూర్య‌కుమార్ యాద‌వ్ గ‌ణాంకాలు ఇవే..

ట్రెండింగ్ వార్తలు