Virat Kohli : మ‌రోసారి బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్న కోహ్లీ.. స్పీచ్ అదిరిపోయింది

స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 నుంచి టీమ్ఇండియా ఓ స‌రికొత్త సంప్ర‌దాయానికి తెర‌లేపింది.

Virat Kohli Best Fielder Award

స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 నుంచి టీమ్ఇండియా ఓ స‌రికొత్త సంప్ర‌దాయానికి తెర‌లేపింది. మ్యాచుల్లో అత్యుత్త‌మ‌ ఫీల్డింగ్ ప్ర‌మాణాలు నెల‌కొల్ప‌డంతో పాటు స‌హ‌చ‌రుల్లో ఉత్సాహం నింపిన ఆట‌గాడికి బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్‌ను ఇస్తూ వ‌స్తున్నారు. టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఈ మెడ‌ల్‌ను అందిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌పంచ‌క‌ప్‌లో ప్ర‌తి మ్యాచుకు అందించ‌గా ఆ త‌రువాత కూడా దీన్ని కొన‌సాగిస్తున్నారు.

ఇక అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌ను టీమ్ఇండియా 3-0 వైట్‌వాష్ చేసింది. ఇక సిరీస్ ముగియ‌డంతో ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఉత్త‌మ ఫీల్డ‌ర్ అవార్డును ప్ర‌క‌టించాడు. సిరీస్ ఆసాంతం అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌ను ఎంచుకున్నాడు. వారిలో ఒక‌రు యువ ఆట‌గాడు రింకూ సింగ్ కాగా.. మ‌రోక‌రు స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ. వీరిద్ద‌రిలో కోహ్లీ బెస్ట్ ఫీల్డర్ మెడ‌ల్ అందుకున్నాడు.

సూప‌ర్ ఓవ‌ర్‌లో రోహిత్ శ‌ర్మ తొండాట‌..! ఆకాశ్ చోప్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అవార్డు ప్ర‌ధానం సంద‌ర్భంగా దిలీప్ మాట్లాడుతూ.. తాను ఓ విష‌యం చెప్పాల‌నుకుంటున్నాన‌ని అన్నాడు. కోహ్లీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో రెండు సార్లు ఈ మెడ‌ల్‌ను అందుకున్నాడు. అంత‌క‌ముందు వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో అత‌డు నాతో ఓ విష‌యాన్ని చెప్పాడు. తాను స్లిప్‌లో నిల‌బ‌డాల‌ని అనుకోవ‌డం లేద‌న్నాడు. క‌ష్ట‌మైన స్థానాల్లో ఫీల్డింగ్ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పాడు. అందుక‌నే అత‌డు ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్యుత్త‌మ ఆట‌గాడిగా నిలిచాడు. అని అన్నాడు.

ఇక జ‌ట్టు కోసం ఎంతో త‌ప‌న ప‌డుతుంటాడు. అలాగ‌ని త‌న ప‌ని తాను చేసుకుంటూ పోడు. స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌లో ఆత్మ‌విశ్వాసాన్ని నింపుతున్నాడ‌ని చెప్పాడు. కొత్త‌గా జ‌ట్టులోకి వ‌చ్చిన వారు కోహ్లీని అనుస‌రించాల‌ని, అత‌డు ప‌డే దానిలో స‌గం క‌ష్ట ప‌డినా త‌ప్ప‌క ఫ‌లితాలు క‌నిపిస్తాయ‌ని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ చెప్పారు. ఇందుకు సంబంధించి వీడియోను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Virat Kohli : విరాట్ కోహ్లీ అద్భుత బౌండరీ సేవ్‌పై ఆనంద్ మహీంద్రా.. ‘హలో, ఐజాక్ న్యూటన్?’