Virender Sehwag: అతను తిరిగొస్తే టెస్ట్ క్రికెట్‌కు ఎగ్జైట్మెంట్ వస్తుంది – వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ చాలా స్పెషల్. ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యం రాబట్ట గల సామర్థ్యం ప‌ృథ్వీ షాకు ఉంది. అలా ఈ మాజీ ఓపెనర్ పృథ్వీ షా "టెస్ట్ క్రికెట్‌లో ఉత్సాహాన్ని తిరిగి తీసుకురాగలడు" అని పేర్కొన్నాడు.

 

.
Virender Sehwag: టీమిండియా ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ చాలా స్పెషల్. ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యం రాబట్ట గల సామర్థ్యం ప‌ృథ్వీ షాకు ఉంది. అలా ఈ మాజీ ఓపెనర్ పృథ్వీ షా “టెస్ట్ క్రికెట్‌లో ఉత్సాహాన్ని తిరిగి తీసుకురాగలడు” అని పేర్కొన్నాడు.

నిజానికి సెహ్వాగ్‌లాగా టాపార్డర్‌లో అగ్రస్థానంలో దూకుడుగా ఆడడానికే ఇష్టపడతాడు. 2020-21లో ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్టు తర్వాత తొలగించబడినప్పటి నుండి యువ ఆటగాడు భారత్‌కు ఆడలేదు.

టెస్టు మాజీ ఓపెనర్ పృథ్వీ షా, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో భారత్‌ను పవర్‌హౌస్‌గా మార్చగలరని వ్యాఖ్యానించాడు. షా, పంత్‌లు క్రీజులో ఉంటే 400 సరిపోతాయో లేదో ప్రతిపక్షాలు ఆలోచించాల్సి ఉంటుందని అన్నారు.

“షా, పంత్ ఒక జట్టులో భారతదేశం టెస్ట్ క్రికెట్‌ను శాసించడం, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడంలో సహాయపడగలరు” అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

Read Also: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్

పృథ్వీ షా 2018లో వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌లో తన టెస్టు అరంగేట్రం చేసి 154 బంతుల్లో 134 పరుగులు చేసి సత్తా చాటాడు. రెండు హాఫ్ సెంచరీలు సాధించినప్పటికీ, ఇప్పటివరకు అతని ఏకైక టెస్ట్ సెంచరీగా నిలిచిపోయింది. ఆడిన ఐదు టెస్టుల్లో 42.37 సగటుతో 339 పరుగులు చేశాడు.

2018లో భారత్‌ను అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌కు తీసుకెళ్లిన షా, ఆరు వన్డేలు, ఒక ఇంటర్నేషనల్ టీ20 కూడా ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2022 సీజన్ జరుగుతున్న సమయంలో 22 ఏళ్ల షాకు టైఫాయిడ్ రావడంతో ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు