Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్

గంగూలీ లీడర్‌షిప్‌కు వీరేంద్ర సెహ్వాగ్ రేటింగ్ ఇచ్చాడు. దానిని విరాట్ కోహ్లీ ఏ మాత్రం చేరుకోలేకపోయాడని నెంబర్లను పోల్చి చెప్తున్నాడు. గ్రేటెస్ట్ ఇండియన్ టీంను లీడ్ చేసిన గొప్ప వారిలో కోహ్లీ ఎప్పటికీ ఒకడిగా ఉంటాడు. కానీ, గంగూలీ మాదిరిగా మంచి టీంను రెడీ చేసుకోలేకపోయాడు.

Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్

Virat Kohli

 

 

Virat Kohli: గంగూలీ లీడర్‌షిప్‌కు వీరేంద్ర సెహ్వాగ్ రేటింగ్ ఇచ్చాడు. దానిని విరాట్ కోహ్లీ ఏ మాత్రం చేరుకోలేకపోయాడని నెంబర్లను పోల్చి చెప్తున్నాడు. గ్రేటెస్ట్ ఇండియన్ టీంను లీడ్ చేసిన గొప్ప వారిలో కోహ్లీ ఎప్పటికీ ఒకడిగా ఉంటాడు. కానీ, గంగూలీ మాదిరిగా మంచి టీంను రెడీ చేసుకోలేకపోయాడు.

సౌరవ్ గంగూలీ కొత్త టీం రెడీ చేసుకున్నాడు. కొత్త ప్లేయర్లను తీసుకొచ్చాడు. గెలుపోటముల్లో వారికి అండగా ఉన్నాడు. కోహ్లీ అతని హయాంలో అలా చేయలేకపోయాడని అనుకుంటున్నా. నా దృష్టిలో నెం.1 కెప్టెన్ ఎవరంటే టీం రెడీ చేసుకున్నవాళ్లు, ప్లేయర్లకు కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్లే. కోహ్లీ కొందరు ప్లేయర్లకు సపోర్ట్ ఇచ్చాడు. కొందరిని వదిలేశాడు” అని చెప్తున్నాడు.

రిషబ్ పంత్ గురించి మాట్లాడుతూ, పరిమిత ఓవర్ క్రికెట్‌లో ఓపెనింగ్ చేస్తే DC కెప్టెన్ మరింత విజయవంతమవుతాడని పేర్కొన్నాడు. టెస్టు జట్టులో షా, పంత్‌లు ఉండడంతో 400 పరుగులు చేస్తే చాలు. అటువంటి సమయంలో ప్రత్యర్థి కూడా ఆలోచించాల్సి వస్తుందని చెప్పాడు.

ఐసీసీ ఈవెంట్లలో కోహ్లికి కూడా గొప్ప రికార్డు ఏమీ లేదు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ లో పాక్ చేతిలో భారత్ ఓడింది. 2019 వన్డే ప్రపంచకప్ లో సెమీస్ కు చేరింది. ఇక 2021 లో టీ20 ప్రపంచకప్‌లో అయితే గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఓ రకంగా కోహ్లి మీదున్న అతిపెద్ద విమర్శ (ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాకు కప్ కొట్టలేదని) కూడా అదే. ఐసీసీ ఈవెంట్లలో ఎలా ఉన్నా టెస్టులలో మాత్రం కోహ్లి.. భారత్‌ను జగజ్జేతగా నిలిపాడు.