Mirabai Chanu wins BBC Indian Sportswoman of the Year
Mirabai Chanu wins BBC Indian Sportswoman of the Year : మణిపూర్ మణిపూస.. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను వరుసగా రెండోసారి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డ్‌ను గెలుచుకున్నారు. వరుసగా రెండో సంవత్సరం కూడా ఈ అవార్డు గెలుచుకున్న మొదటి అథ్లెట్ గా మీరాబాయి చాను చరిత్ర సృష్టించారు. ప్రజలు తమ అభిమాన క్రీడాకారిణికి ఓట్లేసి గెలిపించడంతో చాను ఈ అవార్డును గెలుచుకున్నారు. వంట చెరకు కోసం కట్టెలు కొట్టి మోస్తూ భారతదేశం గర్వించేలా వెయిట్ లిఫ్టింగ్ లో ఎన్నో అవార్డులు గెలిచిన మహిళగా చాను చరిత్ర సృష్టించారు. మణిపూర్ కు చెందిన 28 ఏళ్ల చాను పేదరికాన్ని జయించి భారతజాతి క్రీడాస్ఫూర్తిని చాటిచెప్పారు. ఆదివారం (మార్చి5,2023) సాయంత్రం గాలాలో BBC 2022 సంవత్సరానికి విజేతను ప్రకటించింది. 2021లో కూడా చానీ ఈ అవార్డును గెలుచుకున్నారు. దీంతో వరుసగా రెండుసార్లు ఈ అవార్డు గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా ఆమె గుర్తింపు పొందారు.
2020 టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకున్న ఆమె 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. 2022 వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమె రజత పతకం సాధించారు. ఢిల్లీలో నిర్వహించిన ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించగా..మీరాబాయి చాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ… ఈ అవార్డు రెండోసారి దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆనందం వ్యక్తంచేశారు. తనకు ప్రోత్సహించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు చాను. ఇదే స్ఫూర్తితో మరింతగా కష్టపడి భారతదేశానికి మరిన్ని పతకాలు సాధిస్తానని తెలిపారు. వరుసగా రెండో ఏడాది ‘బీబీసీ ఇండియా స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకోవడంపై బీబీసీ న్యూస్ డిప్యూటీ సీఈఓ..డైరెక్టర్ ఆఫ్ జర్నలిజం జొనాథన్ మన్రో మీరాబాయి చానుకు అభినందనలు తెలియజేశారు.
Mirabai Chanu : పట్టుదలే ఫలితానిచ్చింది, మీరాబాయి చాను గెలిచింది..
ఈ అవార్డ్ కోసం షార్ట్‌లిస్ట్ అయిన ఇతర పోటీదారులలో రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మలిక్, బాక్సర్ నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఉన్నారు.2023లో తొలిసారి ప్రారంభించిన ‘బీబీసీ పారా స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డ్‌ను భవీనా పటేల్ గెలుచుకున్నారు. పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా 2022 టోక్యో సమ్మర్ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకున్నారు.
పారా టేబుల్ టెన్నిస్‌తో రజతం గెలుచుకున్న తొలి భారత క్రీడాకారిణిగా ఆమె రికార్డులకెక్కారు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో భవీనా స్వర్ణం గెలుచుకున్నారు. అవార్డు గెలుచుకున్న 36 ఏళ్ల భవీనా పటేల్ మాట్లాడుతూ..‘’మహిళలకు, క్రీడాకారులకు సాధికారత కల్పించే దిశగా తీసుకున్న ఈ కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. బీబీసీ పారా స్పోర్ట్స్‌పై దృష్టి పెట్టడం..అందరిని కలుపుకొని పోయేలా ముందుకెళ్లటం అభినందనీయం’’ అని అన్నారు.
Olympics : 20 ఏళ్ల భారత్ నిరీక్షణ… రజతాన్ని ముద్దాడిన మీరాబాయి
భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ ప్రీతమ్ సివాచ్‌కు ‘బీబీసీ లైఫ్ టైం అచీవ్‌మెంట్’ అవార్డు దక్కింది. భారతీయ క్రీడారంగానికి, తరువాత తరాలకు స్ఫూర్తినందించినందుకు గాను ఆమెను ఈ అవార్డు వరించింది.1985లో స్థాపించబడిన ద్రోణాచార్య అవార్డు అందుకున్న తొలి మహిళా హాకీ కోచ్ సివాచ్. ప్రీతమ వయస్సు 48 ఏళ్లు.
Tokyo Olympics : భారత్ కు తొలి పతకం తెచ్చిన మీరాబాయి ఇంట్లో సంబరాలు
Mirabai Chanu : మనసు దోచుకున్న చాను, 150 మంది డ్రైవర్లకు భోజనం.. ప్రాక్టీస్ షురూ, ఫోటో వైరల్