Tokyo Olympics : భారత్ కు తొలి పతకం తెచ్చిన మీరాబాయి ఇంట్లో సంబరాలు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కు మణిపూర్ మణిపూస మీరాబాయి చాను తొలిపతకాన్ని అందించిన శుభ సందర్బాన్ని పురస్కరించుకుని మీరాబాయి స్వస్థలం మణిపూర్‌లోని ఆమె నివాసంలో సంబరాలు అంబరాన్ని తాకాయి.

Tokyo Olympics : భారత్ కు తొలి పతకం తెచ్చిన మీరాబాయి ఇంట్లో సంబరాలు

Meera

Tokyo Olymopics 2020: Celebrations Mirabai Chanu Home : టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కు మణిపూర్ మణిపూస మీరాబాయి చాను తొలిపతకాన్ని అందించింది. రజత పతకంతో ఒలింపిక్స్ లో మీరాబాయి శ్రీకారం చుట్టింది. మరిన్ని పతకాలను భారత క్రీడాకారులు సాధించాలని భారతీయులంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. మన క్రీడాకాలు రాణించి భారత్ పేరును ప్రపంచ దేశాలకు సాటి చెప్పాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను రజతం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ శుభ సందర్బాన్ని పురస్కరించుకుని మీరాబాయి స్వస్థలం మణిపూర్‌లోని ఆమె నివాసంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఎంతోమంది మీరాబాయి కుటుంబ సభ్యులకు అభినందలు తెలుపుతున్నారు. మరెంతమంది వారి ఇంటికి వచ్చి మన మీరా పతకం సాధించింది అంటూ సంబరపడిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

2

వెయిట్ లిఫ్టింగ్‌లో ఒలింపిక్ క్రీడల చరిత్రలో రెండవ పతకాన్ని మీరాబాయి చాను భారత్‌కు ఇచ్చారు. వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణి మాత్రం మీరాబాయే. ఈ ఏడాది ఫస్ట్ ఒలింపిక్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించారు చాను. మీరాబాయి చాను భారత్‌కు రజత పతకం సాధించగా.. ఒలింపిక్ క్రీడల రెండవ రోజునే, భారతదేశం పతకాల జాబితాలో తన ఖాతాను తెరవగలిగింది.
వెయిట్‌లిఫ్టింగ్‌లో జెర్క్‌ అండ్‌ క్లీన్‌ కేటగిరీలో మూడో రౌండ్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో విఫలమైనప్పటికి అప్పటికే ఆమెకు పతకం ఖాయమైంది. దీంతో మీరాబాయి చాను కుటుంబసభ్యులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.

3

టోక్యో ఒలింపిక్స్ లో రజత పతాకాన్ని సాధించిన మీరాబాయి చానుకు అభినందలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా మీరాబాయికి అభినందనలు తెలిపారు.మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మీరాబాయికి అభినందనలు తెలుపుతూ..ఇది ఎంతో మంది రోజు..మీరా ద్వారా భారత్ పతకాల పట్టిక మొదలైంది. మీరా యావత్ భారత్ గర్వపడుతోంది అంటూ తెలిపారు. అలాగే హోంమంత్రి అమిత్ షా,కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్ మీరాకు అభినందనలు తెలిపారు.

 

4

అలాగే టీడీపీ అధినేత నారా చంద్రాబాబు నాయుడు మీరాభాయికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ..టోక్యో ఒలింపిక్స్ లో రజత పతాకాన్ని సాధించి మీరాబాయి దేశాన్ని గర్వపడేలా చేసారని అన్నారు. ఏపీకి చెందిన కరణం మల్లీశ్వరి తరువాత ఒలింపిక్స్ లో వెయింట్ లిఫ్టింగ్ విభాగంగలో మీరాబాయి పతకాన్ని గెలుచుకున్న రెండో భారతీయురాలు అని అభినందించారు.

Karanam And Meera

 

కాగా 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి క్యాంస్య పతకం తర్వాత ఆ విభాగంలో పతకం రావడం మళ్లీ ఇదే కావడం విశేషం. 2016 రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం పడినప్పటికి ఆమె ఫెయిల్‌ అయ్యింది. అయితే తన ప్రదర్శనతో నిరాశ చెందని మీరాబాయి 2017లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి.. రెండు దశాబ్దాల తర్వాత ఆ ఫీట్‌ను సాధించిన ఇండియన్‌ వెయిట్‌లిఫ్టర్‌గా నిలిచింది. ఇది ఆమె కెరీర్‌లో ఓ మైలురాయి అనుకోవచ్చు.

Meera

2018 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం, 2019లో ఏషియన్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యంతో మెప్పించింది. ఆపై 2020లో సీనియర్‌ నేషనల్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో తన రికార్డును తానే బద్ధలు కొట్టి స్వర్ణంతో మెరుగైన ఫలితంలో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది మీరాబాయి చాను స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్‌ ఎత్తింది.మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. దాంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.210 కేజీలు ఎత్తి చైనా లిఫ్టర్‌ జిజోయ్‌ పసిడిని దక్కించుకున్నారు.