IND vs WI : భారత్‌తో వన్డే సిరీస్.. రెండేళ్ల తరువాత ఆ ఇద్దరు ఆటగాళ్లకు చోటు.. పూరన్‌కు మొండిచేయి
టెస్టు సిరీస్ 1-0తో కోల్పోయిన వెస్టిండీస్ (West Indies)జట్టు వన్డే సిరీస్ కోసం సిద్దం అవుతోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్ఇండియాకు సవాల్ విసరాలని భావిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published On : July 25, 2023 / 05:08 PM IST
West Indies Announce Squad For ODI Series
IND vs WI ODI series : టెస్టు సిరీస్ 1-0తో కోల్పోయిన వెస్టిండీస్ (West Indies)జట్టు వన్డే సిరీస్ కోసం సిద్దం అవుతోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్ఇండియాకు సవాల్ విసరాలని భావిస్తోంది. మూడు వన్డేల సిరీస్‌ను గెలిచి టెస్టు సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో గురువారం (జూలై 27) నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
ఈ జట్టుకు షై హోప్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, రోవ్‌మన్ పావెల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దాదాపు రెండేళ్ల తరువాత షిమ్రాన్ హెట్‌మెయిర్(Shimron Hetmyer), ఫాస్ట్ బౌలర్ ఒషానే థామస్(Oshane Thomas)కు వన్డే జట్టులో చోటు దక్కింది. అదే క్రమంలో ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన కేల్ మేయర్స్‌కు ఛాన్స్ ఇచ్చింది. అయితే.. ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో ఘోరంగా విఫలం అయిన హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను పక్కన పెట్టేసింది.
Ajinkya Rahane : విండీస్‌తో టెస్టు సిరీస్‌లో విఫలమైన రహానే.. పుజారా గతే పడుతుందా..?
చీఫ్ సెలెక్టర్ డెస్మాండ్ హేనేస్(Desmond Haynes) మాట్లాడుతూ.. హెట్‌మెయిర్, ఒషానే థామస్‌లను మళ్లీ జట్టులోకి స్వాగతిస్తున్నాం. వీరిద్దరికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. సక్సెస్ కూడా అయ్యారు. వీరిద్దరి చేరికతో జట్టు కూర్పు సరిగ్గా కుదురుతుందని భావిస్తున్నట్లు చెప్పాడు.
వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ఇదే : షై హోప్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్(వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, యానిక్ కారియ, కేసీ కార్టి, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్‌మెయిర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, మోతీ, సీలెస్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లెయిర్, ఒషానే థామస్.
వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
మొదటి వన్డే – జూలై 27- కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
రెండవ వన్డే – జూలై 29 – కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
మూడవ వన్డే – ఆగస్ట్ 1 – క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్
ప్రపంచకప్‌కు క్వాలిపై కాలే..
హార్డ్ హిట్టర్లు ఉన్న వెస్టిండీస్ జట్టు ఈ ఏడాది భారత్ వేది్కగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు క్వాలిఫై కాలేదు. ఇలా వెస్టిండీస్ జట్టు ప్రపంచకప్‌కు క్వాలిపై కాకపోవడం ఇదే తొలిసారి. జింబాబ్వే వేదికగా జరిగిన ప్రపంచ కప్ క్వాలిపై టోర్నీలో చిన్న జట్లతో ఓడిపోయి ఘోర అవమానాన్ని మూట గట్టుకుంది వెస్టిండీస్.
