Harmanpreet Kaur : హ‌ర్మ‌న్ వ్యాఖ్య‌లు.. క‌ల‌త చెందిన బంగ్లా కెప్టెన్‌.. ఫోటో దిగ‌కుండా జ‌ట్టుతో క‌లిసి..

భార‌త్‌, బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మూడో వ‌న్డే టైగా ముగిసింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్ 1-1తో స‌మ‌మైంది. సిరీస్ స‌మం కావ‌డంతో ఇరు జ‌ట్లు ట్రోఫీని పంచుకోవాల్సి వ‌చ్చింది

Harmanpreet Kaur : హ‌ర్మ‌న్ వ్యాఖ్య‌లు.. క‌ల‌త చెందిన బంగ్లా కెప్టెన్‌.. ఫోటో దిగ‌కుండా జ‌ట్టుతో క‌లిసి..

Bangladesh Skipper Nigar Sultana Skips Photo Session

Harmanpreet Kaur-Nigar Sultana : భార‌త్‌, బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మూడో వ‌న్డే టైగా ముగిసింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్ 1-1తో స‌మ‌మైంది. సిరీస్ స‌మం కావ‌డంతో ఇరు జ‌ట్లు ట్రోఫీని పంచుకోవాల్సి వ‌చ్చింది. ట్రోఫీ ప్ర‌ధానోత్స‌వం త‌రువాత ఇరు జ‌ట్లు క‌లిసి గ్రూప్ ఫోటో దిగాల్సి ఉంది. అయితే.. బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా త‌మ జ‌ట్టు ప్లేయ‌ర్ల‌ను తీసుకుని ఫోటో దిగకుండానే అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Rohit Sharma : టెస్టుల్లో చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ప్ర‌పంచంలోనే తొలి ఆట‌గాడిగా

నిగ‌ర్ మాట్లాడుతూ.. ‘అది హ‌ర్మ‌న్ స‌మ‌స్య‌. అయితే.. ఆమె కొంత స‌భ్య‌త‌తో ప్ర‌వ‌ర్తించి ఉండాల్సింది. ఏం జ‌రిగిందనేది నేను చెప్ప‌లేను. అయితే.. ఆ స‌మ‌యంలో ఆ లొకేష‌న్‌లో నా టీమ్‌తో క‌లిసి ఉండ‌డం స‌రైన‌ది కాద‌ని అనిపించింది. అందుకే అక్క‌డి నుంచి వెళ్లిపోయా. క్రికెట్ అనేది గౌర‌వం, క్ర‌మ శిక్ష‌ణ‌కు సంబంధించిన ఆట‌. అంపైర్ నిర్ణయాన్ని అంగీకరిస్తాం. అంపైర్ ఔట్ ఇస్తే మేము హర్మన్‌ప్రీత్ లాగా ప్రవర్తించం. మ‌న‌కు న‌చ్చినా, న‌చ్చ‌క‌పోయినా అంపైర్ల‌వే తుది నిర్ణ‌యం.’ అని నిగ‌ర్ అంది. కాగా.. భార‌త కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ అన్న మాట‌ల‌కు నొచ్చుకుని నిగర్ సుల్తానా తన జ‌ట్టుతో వెళ్లిపోయిన‌ట్లు తెలుస్తోంది.

ఏం జ‌రిగిందంటే..?

మూడో వ‌న్డేలో హ‌ర్మన్ ప్రీత్ కౌర్‌ను అంపైర్ ఔట్‌గా ప్ర‌క‌టించ‌గానే స‌హ‌నం కోల్పోయిన హ‌ర్మ‌న్ వికెట్ల‌ను బ్యాట్‌తో కొట్టింది. అంపైర్లను దూషించుకుంటూ మైదానాన్ని వీడింది. హ‌ర్మ‌న్ ఔట్ విష‌యంలో ఎల్బీనా లేదా క్యాచ్ ఔటా అన్న దానిపై సందేహాలు మొద‌ట ఉండేవి. క్యాచ్ ఔట్ అని ఆ త‌రువాత తెలిసింది. అయితే.. బౌల‌ర్ అప్పీల్ చేయ‌డమే ఆల‌స్యం అన్న‌ట్లు ఔట్ ఇచ్చేందుకు అంపైర్ సిద్దంగా ఉన్న‌ట్లు అనిపించ‌డం హ‌ర్మ‌న్‌కు కోపాన్ని తెప్పించింది.

Ishant Sharma : రిష‌బ్‌పంత్ ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌డు.. వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌కు డౌటే..! టీమ్ఇండియా పేసర్‌ కీల‌క వ్యాఖ్య‌లు

మ్యాచ్ ముగిసిన త‌రువాత కూడా హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ అంపైర్ల‌పై మండిప‌డింది. మ‌రోసారి బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చేముందు ఇలాంటి అంపైరింగ్‌కు సిద్ద‌మ‌య్యే వ‌స్తామ‌ని చెప్పింది. ఇక ట్రోఫీ తీసుకుంటున్న స‌మ‌యంలో హ‌ర్మ‌న్ బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌ను అవ‌మాన ప‌రిచేలా మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. మీరు మాత్ర‌మే ఎందుకు వ‌చ్చారు..? అంపైర్ల‌నూ తీసుకురండి..? మ్యాచ్‌ను మీ కోసం వారు టై చేశారు అన‌డంతో క‌ల‌త చెందిన బంగ్లాదేశ్ కెప్టెన్ నిగ‌ర్ ఫోటో దిగ‌కుండా అక్క‌డి నుంచి వెళ్లిపోయింది.

ఇదిలా ఉంటే.. హ‌ర్మ‌న్‌పై ఐసీసీ చ‌ర్య‌లు తీసుకుంది. ఆమె మ్యాచ్ ఫీజులో 75 శాతం జ‌రిమానా విధించ‌డంతో పాటు మూడు అయోగ్య‌తా పాయింట్లు కూడా కేటాయించింది.

Aiden Markram : ప్రియురాలిని పెళ్లాడిన స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్.. అత్త బాగుందంటూ..!