టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌

  • Publish Date - December 15, 2019 / 07:45 AM IST

వెస్టిండీస్‌పై వన్డేల్లో ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న టీమిండియా మరోసారి తన సత్తాచాటేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే భారత్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీసేనఅదే ఉత్సాహంతో వన్డే సిరీస్‌ విజయంపై గురి పెట్టింది. చెన్నైలో జరుగుతున్న తొలి వన్డేలో కరీబియన్లను ఓడించి సిరీస్‌పై ఆధిపత్యం చెలాయించాలని పట్టుదలగా ఉంది టీమిండియా.

టీ20ల్లో ఓడినా కూడా వన్డేల్లో తమ సత్తా చాటుకోవాలని విండీస్ కూడా పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన వెస్టిండీస్‌ బౌలింగ్ ఎంచుకుంది. 

జట్లు:

భారత్‌: విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్, కేదార్‌ జాదవ్, శివమ్‌ దూబే, రవింద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్, మొహమ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌.

వెస్టిండీస్‌: పొలార్డ్‌ (కెప్టెన్‌), షై హోప్, క్యారీ పియరీ, రోస్టన్‌ చేజ్, సునీల్‌ ఆంబ్రిస్, నికోలస్‌ పూరన్, హెట్‌మైర్, అల్జారీ జోసెఫ్, హెడెన్ వాల్ష్, జాసన్ హోల్డర్, కీమో పాల్‌, కాటెరల్.