ODI World Cup 2023 : ప్ర‌పంచ‌క‌ప్ నుంచి గిల్ ఔట్‌..? మరో ఆట‌గాడి కోసం చూస్తున్న సెలక్టర్లు..? ఆ ఇద్ద‌రికి గోల్డెన్ ఛాన్స్‌..!

భార‌త జ‌ట్టు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో విజ‌యంతో బోణీ చేసింది. అయిన‌ప్ప‌టికీ భార‌త శిబిరం ఆందోళ‌న చెందుతోంది.

Who can replace Shubman Gill

ODI World Cup : భార‌త జ‌ట్టు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో విజ‌యంతో బోణీ చేసింది. అయిన‌ప్ప‌టికీ భార‌త శిబిరం ఆందోళ‌న చెందుతోంది. ఇందుకు కార‌ణం ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ అనారోగ్యం బారిన ప‌డ‌డ‌మే. అత‌ను కోలుకునేందుకు మ‌రో వారం రోజుల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఆ స‌మ‌యానికి కోలుకున్న‌ప్ప‌టికీ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తాడా లేదా అన్నదానిపై అనుమానాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

డెంగ్యూ ఫీవ‌ర్ కార‌ణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు గిల్ దూరం అయ్యాడు. అఫ్గానిస్థాన్‌తో బుధ‌వారం జ‌ర‌గ‌నున్న రెండో మ్యాచ్‌కు సైతం అత‌డు అందుబాటులో ఉండ‌డం లేద‌ని బీసీసీఐ ఇప్ప‌టికే వెల్ల‌డించింది. శ‌నివారం పాకిస్తాన్‌తో జ‌ర‌గ‌నున్న కీల‌క పోరుకు అత‌డు కోలుకుంటాడ‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే.. ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన గిల్‌ను వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించిన‌ట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. దీంతో అత‌డు పాక్‌తో మ్యాచ్‌కు సైతం అందుబాటులో ఉండే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి.

2028 LA Olympics : 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఫ్యాన్స్ క‌ల నెర‌వేర‌బోతుంది..!

ఒక‌వేళ ఆ స‌మ‌యానికి అత‌డు కోలుకున్నా.. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తాడా లేదా అన్న ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. ఈ క్ర‌మంలో అత‌డికి బ్యాక‌ప్ ఆట‌గాడిని సిద్ధంగా ఉంచ‌డం గురించి సెలెక్ట‌ర్లు ఆలోచిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో టీమ్ మేనేజ్‌మెంట్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ఓపెన‌ర్లు అయిన రుతురాజ్ గైక్వాడ్‌, య‌శ‌స్వి జైస్వాల్‌లో ఒక‌రికి ఆ అదృష్టం ద‌క్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాగా.. వీరిద్ద‌రు ఆసియా క్రీడ‌లు 2023లో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన జ‌ట్టులో ఉన్నారు. ఈ జ‌ట్టుకు రుతురాజ్ నాయ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

అయితే.. జ‌ట్టు మేనేజ్‌మెంట్ మాత్రం ఈ ఇద్ద‌రిలో అనుభ‌వం ఉన్న రుతురాజ్ గైక్వాడ్ వైపే మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కావ‌డానికి ముందు ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా వ‌న్డే సిరీస్‌ను ఆడ‌గా తొలి రెండు వ‌న్డేల్లో రుతురాజ్ ఆడాడు. 71, 8 పరుగులు చేశాడు.

KL Rahul : కేఎల్ రాహుల్ కామెంట్స్‌.. అస్స‌లు ఊహించ‌లేదు.. అయ్య‌ర్ క‌నీసం రెండు ఓవ‌ర్లు అన్నా..

ట్రెండింగ్ వార్తలు