Why birthday boy Tilak varma dropped from ind vs aus 5th t20i
Tilak varma : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఐదో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తుది జట్టులో టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కలేదు. అతడి స్థానంలో రింకూ సింగ్‌కు అవకాశం ఇచ్చారు. టాస్ సందర్భంగా ఈ విషయాన్ని టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.
ఆసియాకప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో పాక్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత జట్టుకు టైటిల్ అందించిన తిలక్ వర్మ(Tilak varma)ను ఆసీస్‌తో ఐదో టీ20 మ్యాచ్‌కు ఎందుకు తప్పించారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో తిలక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేదు. మూడు మ్యాచ్‌ల్లో అతడు 34 పరుగులు (0, 29, 5) మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే తిలక్ కు టీమ్‌మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చినట్లుగా క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
రొటేషన్ పాలసీనా?
అయితే.. ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో తిలక్ వర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఓ రెండు మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రన అతడిని పక్కన పెట్టారని భావించలేము. టీ20 ప్రపంచకప్ 2026కి మరెంతో సమయం లేదు. అందుకనే రిజర్వ్ బెంచీని పరీక్షించడంతో పాటు వివిధ కాంబినేషన్లను ప్రయత్నించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తిలక్ కు విశ్రాంతి ఇచ్చి రింకూ సింగ్‌కు చోటు ఇచ్చింది. తిలక్ ఈ ఏడాది టీ20ల్లో 16 మ్యాచ్‌ల్లో 380 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా రింకూ సింగ్ నయా ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 34 టీ20ల్లో 160 కి పైగా స్ట్రైక్ రేటుతో 550 పరుగులు చేశాడు.
Abhishek Sharma : చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచ టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్కడు
కాగా.. ఈ రోజు (నవంబర్ 8) తిలక్ వర్మ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో బర్త్ డే రోజు మ్యాచ్ ఆడి సెంచరీ చేస్తే బాగుండేదని అతడి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పుట్టిన రోజు గంభీర్ గొప్ప బహుమతి ఇచ్చాడని సెటైర్లు వేస్తున్నారు.