IND vs PAK : అయ్యో ఎంత పనాయె.. ఒలింపిక్స్‌లో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ లేనట్లే..! ఐసీసీనే కారణమా!
క్రికెట్‌లో భారత్, పాక్ మ్యాచ్‌కు (IND vs PAK) ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
LA Olympics 2028 no India vs Pakistan match
IND vs PAK : క్రికెట్‌లో భారత్, పాక్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టోర్నీ ఏదైనా సరే ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే చాలు.. రెండు దేశాల అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇక ప్రపంచకప్ లాంటి ఈవెంట్‌లలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
1900 తర్వాత ఒలింపిక్స్‌లో తొలిసారి క్రికెట్‌ను చేర్చారు. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. అయితే.. ఈ మెగా ఈవెంట్‌లో భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. ఇందుకు కారణం ఐసీసీ కొత్తగా రూపొందించిన రూల్స్.
Abhishek Sharma : చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచ టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్కడు
ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపై ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన సమావేశాల్లో ఐసీసీ కొన్ని రూల్స్‌ను రూపొందించినట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. పురుషుల క్రికెట్ నుంచి 6 జట్లు, మహిళల క్రికెట్ నుంచి 6 జట్లు ఒలింపిక్స్‌లో పాల్గొననున్నాయి.
గతంలో టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేయాలని భావించినప్పటికి దీనిని పక్కన పెట్టినట్లుగా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రాంతీయ అర్హతతో జట్లను ఎంపిక చేయాలని ఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంటే.. ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా రీజినల్స్‌లో టాప్‌లో ఉన్న జట్లు నేరుగా ఒలింపిక్స్‌లో ప్రవేశిస్తాయి. ఐదో జట్టుగా ఆతిథ్య దేశం, ఆరో జట్టును క్వాలిఫయర్ రౌండ్ ఏర్పాటుచేసి నిర్ణయిస్తారు.
ఒలింపిక్స్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లేదా?
ఐసీసీ ర్యాంకుల ఆధారంగా ఆసియా నుంచి భారత్, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా, యూరప్ నుంచి ఇంగ్లాండ్ జట్లు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. కాగా.. ఒలింపిక్స్‌కు అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. దీంతో ఈ రెండు జట్లలో ఆతిథ్య హోదా పై ఏ దేశం ఆడుతుందనే దానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక ఆరో జట్టు కోసం నిర్వహించే క్వాలిఫయర్ పోటీల విషయమై త్వరలోనే ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.
అంటే ఈ లెక్కన క్వాలిఫయర్ పోటీలో విజేతగా నిలిచి ఆరో జట్టుగా పాక్ జట్టు ఒలింపిక్స్‌లో అడుగుపెడితే మినహా.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌ను చూడలేం. ఇక ఒలింపిక్స్‌లో ఆరు జట్లు పాల్గొననుండగా.. ఒక్కొ జట్టు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. సెమీస్, ఫైనల్‌తో కలిసి మొత్తం 28 మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉంది.
