సర్ఫరాజ్ ఖాన్ నెం.97 జెర్సీని ఎందుకు ధరిస్తాడో తెలుసా? సర్ఫరాజ్ తండ్రికి.. ఆ జెర్సీకి సంబంధం ఏమిటి..

సర్ఫరాజ్ అరంగేట్రం చేసిన నాటి నుంచి తాను ధరించిన జెర్సీ నెంబర్ 97పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

Sarfaraz Khan Wear Jersey : రాజ్‌కోట్‌ మైదానంలో ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్ట్ ద్వారా ముంబై మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ లోనే అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. తొలి ఇన్నింగ్స్ లో 48 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు. ఆ ఇన్నింగ్స్ లో మొత్తం 66 బంతులు ఆడిన సర్ఫరాజ్ 62 పరుగులుచేసి దురదృష్టవశాత్తూ రన్ ఔట్ అయ్యాడు. సర్ఫరాజ్ అరంగేట్రం చేసిన నాటి నుంచి తాను ధరించిన జెర్సీ నెంబర్ 97పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. జెర్సీ నెం. 97ను ఎంచుకోవటానికి కారణం ఏమిటనే అంశం ఆసక్తికరంగా మారింది. తాజాగా 97 జెర్సీపై అతని తండ్రి నౌషాద్ ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Also Read : Rishabh Pant : ఐపీఎల్‌కు సిద్ధం.. వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ మొదలెట్టిన రిషబ్ పంత్.. వీడియో వైరల్

ఇటీవల అండర్-19 ప్రపంచ కప్ లో భారతదేశం తరపున ఆడిన సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ జెర్సీ నెంబర్ కూడా 97 కావటం విశేషం. ఈ విషయంపై నౌషాద్ మాట్లాడుతూ.. హిందీలో నౌ, సౌత్ వరుసగా 9, 7ని సూచిస్తాయి. వాటిని కలపడం వల్ల నౌసౌత్ ఏర్పడుతుంది. ఇది నౌషాద్ పేరును పోలి ఉంటుంది. ఇది వారి తండ్రి పట్ల కృతజ్ఞత, ప్రేమ ను వక్తపరుస్తుంది. సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ లకు నౌషాద్ ఖాన్ కోచ్, మెంటర్ గా ఉన్నారు. ఇదిలాఉంటే.. సర్ఫరాజ్ ఖాన్ పుట్టిన సంవత్సరం 1997. దీంతో జెర్సీ నెంబర్ 97 సర్ఫరాజ్ పుట్టిన సంవత్సరంతో పోలిఉంటుంది.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు