Vaibhav Sooryavanshi : వైభవ్‌కు బిగ్‌షాక్.. సంజూ రీఎంట్రీ.. కెప్టెన్ శ్రేయాస్ కీలక కామెంట్స్.. అసలేం జరిగిందంటే?
Vaibhav Sooryavanshi : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్, యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కలేదు.
- Harish Thanniru
- Updated on- July 11, 2026 / 09:14 PM IST
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్, యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కలేదు. దీంతో సంజూ శాంసన్ తుది జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇదే అంశంపై కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందిస్తూ కీలక కామెంట్స్ చేశాడు.
Also Read : Gautam Gambhir : బీసీసీఐ టార్గెట్ గంభీర్ కానే కాదు.. అప్పటి వరకు హెడ్‌కోచ్‌గా అతడే..
టాస్ సందర్భంగా శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ పూర్తిగా కోలుకొని జట్టులోకి తిరిగి వచ్చాడు. సంజూ రాకతో జట్టు సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని వైభవ్ సూర్యవంశీకి విశ్రాంతి ఇచ్చినట్లు చెప్పాడు. ఈ నిర్ణయం పూర్తిగా టీమ్ కాంబినేషన్ దృష్ట్యా తీసుకున్నదేనని తెలిపాడు. వైభవ్ సూర్యవంశీ ప్రతిభకలిగిన యువ ప్లేయర్ అంటూ కొనియాడిన శ్రేయాస్.. జట్టు అవసరాలకు అనుగుణంగా తుది జట్టు నుంచి అతనికి విశ్రాంతి ఇవ్వడం జరిగిందని, తిరిగి సంజూను తుది జట్టులోకి తీసుకోవటం జరిగిందని చెప్పారు.
ఎన్నో ఆశలు, భారీ అంచనాల మధ్య టీమిండియా జెర్సీ ధరించిన ఈ యువ ఆటగాడు ఆశించిన స్థాయిలో పరుగులు సాధించలేకపోయాడు. ఈ సిరీస్ లో వైభవ్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మొత్తం మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 42 పరుగులు మాత్రమే సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 105 దాటకపోవడం గమనార్హం.
