Shubman Gill : వింబుల్డన్ రాయల్ బాక్స్‌లో సచిన్ టెండూల్కర్, అంజలితో కలిసి గిల్.. వైరల్ ఫోటో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది
శుభ్‌మన్ గిల్ (Shubman Gill) లండన్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రత్యేక అతిథిగా హాజరై మరోసారి వార్తల్లో నిలిచాడు
Viral photo Shubman Gill Joins Sachin Tendulkar, Anjali In Wimbledon Royal Box
Shubman Gill : భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ లండన్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రత్యేక అతిథిగా హాజరై మరోసారి వార్తల్లో నిలిచాడు. లండన్‌లోని సెంటర్ కోర్టులో ఉన్న ప్రతిష్ఠాత్మక రాయల్ బాక్స్‌లో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలితో కలిసి గిల్ మ్యాచ్‌ను వీక్షించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. వింబుల్డన్ రాయల్ బాక్స్‌కు ఆహ్వానం అందుకున్న భారత కెప్టెన్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత శుభ్‌మన్ గిల్ నాలుగో భారత కెప్టెన్‌గా నిలవడం గమనార్హం.
Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ‘ట్రిపుల్ సెంచరీ’
ఇదిలా ఉంటే.. సచిన్ దంపతులతో కలిసి గిల్ కూర్చున్న ఫోటోలు వైరల్ అవుతుండడంతో సోషల్ మీడియా దృష్టి మాత్రం మరో టాపిక్ వైపు మళ్లింది.
Shubman Gill with Sachin Tendulkar and Anjali Tendulkar at Wimbledon ❤️ pic.twitter.com/mLkqV9Tjfg
— Shubman Gill Fc (@ShubmanGill7fc) July 10, 2026
సచిన్ కూతురు సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అటు సారా గానీ, ఇటు గిల్ గానీ ఎప్పుడూ స్పందించలేదు. అయితే.. తాజాగా సచిన్ దంపతులతో గిల్ కలిసి రాయల్ బాక్స్ లో కనిపించడంతో సారాతో నిజంగా భారత వన్డే కెప్టెన్ ప్రేమలో ఉన్నాడని వార్తలకు బలం చేకూరినట్లైందని పలువురు నెటిజన్లు అంటున్నారు.
