Will Arshdeep singh play match against Oman in Asia Cup 2025
Arshdeep singh : ఆసియాకప్ 2025లో టీమ్ఇండియా అదరగొడుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి సూపర్-4లో అడుగుపెట్టింది. గ్రూప్ దశలో తమ చివరి మ్యాచ్‌ను శుక్రవారం (సెప్టెంబర్ 19న) ఒమన్‌తో ఆడనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియ తుది జట్టు కూర్పు ఎలా ఉండనుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఒమన్‌తో గెలవడం టీమ్ఇండియాకు పెద్ద కష్టం కాదు. అయితే.. ఆ తరువాత సూపర్-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 21న) పాక్‌తో భారత్ తలపడాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్‌లకు మధ్య కేవలం ఒక్క రోజు విరామం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఒమన్‌తో మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకావం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా టీమ్ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను పాక్‌తో మ్యాచ్‌కు తాజాగా ఉంచడం కోసం అతడికి విశ్రాంతి ఇవ్వొచ్చునని సదరు వార్తల సారాంశం.
SL vs AFG : అఫ్గాన్‌కు లంక కష్టాలు..! నాగిని డ్యాన్స్ చేసేందుకు బంగ్లాదేశ్ ఎదురుచూపులు..!
అదే జరిగితే.. అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్(Arshdeep singh)కు తుది జట్టులో చోటు దక్కవచ్చు. ఒకప్పుడు టీ20ల్లో రెగ్యులర్ బౌలర్ అయిన అర్ష్‌దీప్ సింగ్ ప్రస్తుతం తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా తరుపున 99 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ కొనసాగుతున్నాడు. 100 వికెట్ల క్లబ్‌లో చేరేందుకు అతడికి మరొక్క వికెట్ అవసరం. ఈ వికెట్ తీసేందుకు అతడు గత ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నాడు. ఒమన్‌తో మ్యాచ్‌లో అవకాశం వచ్చి.. అతడు వికెట్ తీసి చరిత్ర సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Muhammad Waseem : పాక్ పై అందుకే ఓడిపోయాం.. యూఏఈ కెప్టెన్ వసీం కామెంట్స్ వైరల్..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* అర్ష్‌దీప్ సింగ్ – 63 మ్యాచుల్లో – 99 వికెట్లు
* యుజ్వేంద్ర చాహల్ – 80 మ్యాచుల్లో 96 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 116 మ్యాచ్‌ల్లో 95 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 72 మ్యాచుల్లో – 92 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ – 87 మ్యాచుల్లో – 90 వికెట్లు