SRH : ఆస్ట్రేలియా కెప్టెన్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? అయితే.. ఐపీఎల్ ట్రోఫీ స‌న్‌రైజ‌ర్స్‌దే..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అద‌ర‌గొడుతోంది.

Sunrisers Hyderabad : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అద‌ర‌గొడుతోంది. కొత్త కెప్టెన్ పాట్ క‌మిన్స్ నాయ‌క‌త్వంలో ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. శుక్ర‌వారం చెపాక్ వేదిక‌గా జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ను ఓడించింది. ఆదివారం చెపాక్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి స‌న్‌రైజ‌ర్స్ క‌ప్పును ముద్దాడాల‌ని ఎస్ఆర్‌హెచ్ అభిమానులు కోరుకుంటున్నారు.

కాగా.. ఓ సెంటిమెంట్ వ‌ర్కౌట్ అయితే మాత్రం ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌ను ఎస్ఆర్‌హెచ్ గెల‌వ‌డం ప‌క్కా అని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు రెండు సార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచింది. 2009, 2016 సీజ‌న్ల‌లో ఎస్ఆర్‌హెచ్ ఐపీఎల్ ట్రోఫీల‌ను ముద్దాడింది.

Pat Cummins : రాజ‌స్థాన్ పై విజ‌యం.. కెప్టెన్ క‌మిన్స్ కీల‌క వ్యాఖ్య‌లు.. టోర్నీ ఆరంభం నుంచి మా ల‌క్ష్యం ఒక్క‌టే..

ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ల‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పేరు డెక్కన్ ఛార్జర్స్ అన్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌గా పేరు మారింది. 2009లో అప్ప‌టి డెక్క‌న్ ఛార్జ‌ర్స్ ఫైన‌ల్ మ్యాచులో రాయ‌ల్ ఛాలెంజ‌ర్ బెంగ‌ళూరు జ‌ట్టును ఓడించి మొద‌టి సారి విజేత‌గా నిలిచింది. అప్పుడు డెక్క‌న్ ఛార్జ‌ర్స్ కు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా ఆట‌గాడు ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్ ఉన్నాడు. ఇక 2016లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫైన‌ల్ మ్యాచులో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఓడించి రెండో సారి క‌ప్పును ముద్దాడింది. అప్పుడు ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ ఉన్నాడు.

ఇక ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ పాట్ క‌మిన్స్ స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అత‌డి నాయ‌క‌త్వంలో ఫైన‌ల్‌కు చేరుకుంది ఎస్ఆర్‌హెచ్‌. కాగా.. ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు కెప్టెన్లుగా ఉన్న స‌మ‌యంలో ఫైన‌ల్‌కు చేరుకున్న రెండు సంద‌ర్భాల్లో హైద‌రాబాద్ విజేత‌గా నిలిచింది. ఈ సెంటిమెంట్ వ‌ర్కౌట్ అయితే ముచ్చ‌ట‌గా మూడో సారి క‌ప్పును ముద్దాడ‌నుంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Virat Kohli : ఐపీఎల్ నుంచి ఆర్‌సీబీ ఔట్‌.. విరాట్ కోహ్లి పోస్ట్ వైర‌ల్‌

కాగా.. హైద‌రాబాద్ జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం ఇది నాలుగో సారి. 2018 సీజ‌న్‌లో సైతం ఫైన‌ల్‌కు చేరుకున్న హైద‌రాబాద్ చెన్నై సూప‌ర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. అప్పుడు న్యూజిలాండ్ ఆట‌గాడు కేన్ విలియ‌మ్స‌న్ కెప్టెన్‌గా ఉన్నాడు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ప్ర‌కారం ఆస్ట్రేలియా కెప్టెన్ల సెంటిమెంట్ వ‌ర్కౌట్ అయి స‌న్‌రైజ‌ర్స్ విజేత‌గా నిలుస్తుందో లేదో మ‌రికొద్ది గంట‌ల్లో తేలిపోనుంది.

ట్రెండింగ్ వార్తలు