×
Ad

IND vs SA : ఐదో టీ20 మ్యాచ్‌కు పొగ మంచు ముప్పు ఉందా?

ల‌క్నో వేదిక‌గా బుధ‌వారం భార‌త్, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ (IND vs SA) పొగ‌మంచు కార‌ణంగా ర‌ద్దు అయిన సంగ‌తి తెలిసిందే.

Will Fog effect to IND vs SA 5th T20

IND vs SA : ల‌క్నో వేదిక‌గా బుధ‌వారం భార‌త్, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ పొగ‌మంచు కార‌ణంగా ర‌ద్దు అయిన సంగ‌తి తెలిసిందే. క‌నీసం టాస్ వేయ‌కుండానే మ్యాచ్ ను ర‌ద్దు చేశారు.

ఇక సిరీస్‌లో ఆఖ‌రి టీ20 మ్యాచ్ శుక్ర‌వారం అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోదీ స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ అయినా జ‌రుగుతుందా? లేక పొగ‌మంచు ప్ర‌భావం ప‌డుతుందా? అని ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు.

Ravichandran Ashwin : మ్యాచ్ లే స్టార్ట్ కాలేదు.. అప్పుడే టాప్ 4 అంట..

అయితే.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మ్యాచ్ రోజున అహ్మ‌దాబాద్‌లో పొగ‌మంచు అధికంగా ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. ఇక 15 నుంచి 30 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు ఉండొచ్చున‌ని పేర్కొంది. ఆకాశం చాలా నిర్మ‌లంగా ఉంటుంద‌ని పేర్కొంది.

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భార‌త్ ప్ర‌స్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఐదో మ్యాచ్‌లో గెలిస్తే 3-1తో టీమ్ఇండియా సిరీస్‌ను కైవ‌సం చేసుకుంటుంది. ఒక‌వేళ సౌతాఫ్రికా గెలిస్తే మాత్రం అప్పుడు సిరీస్ 2-2తో స‌మం అవుతుంది.