Will MI vs GT IPL 2025 Match Be Abandoned Due To Rain
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసులో మరింత ముందుకు వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ముంబై, గుజరాత్‌లకు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తుండగా ఇప్పుడు వర్షం ముప్పు వారికి ఆందోళన కలిగిస్తోంది.
Shubman Gill : శుభ్‌మన్ గిల్ పై నాయకత్వ ఒత్తిడి పడుతోందా?
అక్యూవెదర్ ప్రకారం మ్యాచ్ ప్రారంభానికి ముందు అంటే సాయంత్రం నాలుగు నుంచి 6 గంటల మధ్య వర్షం పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. దీని వల్ల టాస్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ సమయంలో భారీ వర్షం కురవపోయినా చిరుజల్లులు పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది.
అంటే 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోయినప్పటికీ కూడా ఓవర్ల కుదింపుతో మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
హెడ్-టు-హెడ్..
ఇరు జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 6 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో గుజరాత్ విజయం సాధించింది. ముంబై రెండు మ్యాచ్‌ల్లో గెలిపింది. ఇక వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు కేవలం ఒక్క సారి మాత్రమే తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ముంబై గెలిచింది.
RCB : ఇదెక్కడి ట్విస్ట్ రా అయ్యా.. ఇలా జరిగితే ఐపీఎల్ 2025 నుంచి ఆర్‌సీబీ ఔట్?