Virat Kohli: కోహ్లీ పేరు ఇంతలా మార్మోగిపోతోందేంటీ? స్పెయిన్‌ యువ సంచలనం అల్కరాజ్‌ వల్ల ఇప్పుడు ఈ వీడియో..

వింబుల్డన్‌ తుదిపోరులో సెర్బియా దిగ్గజ ఆటగాడు జకోవిచ్‌ను ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. 

Carlos Alcaraz, kohli

Virat Kohli – Carlos Alcaraz: భారత (India) క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరు, ప్రతిష్ఠలు జగద్వితం. క్రికెట్ (Cricket) ప్రపంచంలోనే కాకుండా, ఇతర క్రీడల సమయంలోనూ కోహ్లీ పేరు వినపడుతోంది. ప్రపంచంలో యువ ఆటగాళ్లు ఏదైనా అద్భుతమైన విజయం సాధిస్తే వారిని మరో దిగ్గజ ఆటగాళ్లతో పోల్చడం పరిపాటే.

యూఎస్‌ ఓపెన్‌ (US Open 2022) విజేత, స్పెయిన్‌ యువ సంచలనం అల్కరాజ్‌ (20) తాజాగా వింబుల్డన్‌ తుదిపోరులో సెర్బియా దిగ్గజ ఆటగాడు జకోవిచ్‌ను ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ సమయంలో గతంలో ఓ కామెంటేటర్ అల్కరాజ్‌ను విరాట్ కోహ్లీతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ” క్రికెట్లో విరాట్ కోహ్లీ, బాస్కెట్ బాల్‌లో మైఖేల్ జోర్డాన్ ను చూస్తున్నట్లు ఉంది ” అని కామెంటేటర్ అల్కరాజ్‌ షాట్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

ఇది చాలా ప్రత్యేకమైన షాట్ అని మరో కామెంటేటర్ అన్నారు. గ్రీక్ టెన్నిస్ ఆటగాడు సిట్సిపాస్ తో అల్కరాజ్‌ ఆడుతూ ఓ అద్భుతమైన షాట్ కొట్టినప్పటిది ఈ వీడియో. కాగా, అల్కరాజ్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 9,675 పాయింట్లతో ప్రపంచ నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జొకోవిచ్‌ 8,795 పాయింట్లతో రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు.

Jasprit Bumrah : వ‌స్తున్నా.. వ‌చ్చేస్తున్నా.. అంటున్న బుమ్రా.. వీడియో వైర‌ల్‌