Women World Cup: విశాఖ వేదికగా ఉమెన్ వరల్డ్ కప్ పోటీలు, ఐపీఎల్ మ్యాచులు- కేశినేని చిన్ని

రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని చిన్ని చెప్పారు.

Women World Cup: మహిళా ప్రపంచకప్ క్రికెట్ పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. అంతేకాదు రానున్న రోజుల్లో విశాఖలో మరిన్ని ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు జై షా అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని చిన్ని చెప్పారు. రాష్ట్ర యువత దశ దిశ అన్నట్లుగా క్రీడలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు.

Also Read: వైభవ్‌ సూర్యవంశీ మాత్రమే కాదు.. ఈ ఆరుగురు చిచ్చరపిడుగులు కూడా అప్పట్లో ఇంత చిన్న వయసులోనే.. వామ్మో..

అమరావతి ప్రీమియర్‌ లీగ్‌ పేరిట జర్నలిస్టులకు మూడు రోజుల పాటు నిర్వహించిన క్రికెట్‌ పోటీలు ముగింపు వేడుకలకు హాజరయ్యారు కేశినేని చిన్ని. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తొలి 2 స్థానాల్లో రాజధాని మీడియా, అమరావతి మీడియా జట్లు నిలిచాయి. బెజవాడ మీడియా జట్టు మూడో స్థానం దక్కించుకుంది.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here