Womens Asia Cup 2026 : స్మృతి మంధాన సెంచ‌రీ.. హాంగ్‌కాంగ్ ముందు భారీ ల‌క్ష్యం..

మ‌హిళ‌ల ఆసియాక‌ప్ 2026లో (Womens Asia Cup 2026) భాగంగా దుబాయ్ వేదిక‌గా హాంగ్‌కాంగ్‌తో మ్యాచ్‌లో భార‌త ఓపెన‌ర్ స్మృతి మంధాన సెంచ‌రీతో చెల‌రేగింది.

Womens Asia Cup 2026 Smriti Mandhana Century

Womens Asia Cup 2026 : మ‌హిళ‌ల ఆసియాక‌ప్ 2026లో భాగంగా దుబాయ్ వేదిక‌గా హాంగ్‌కాంగ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త ఓపెన‌ర్ స్మృతి మంధాన (124 ; 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) సెంచ‌రీతో చెల‌రేగింది. ఈ క్ర‌మంలో భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 193 ప‌రుగులు చేసింది. దీంతో హాంగ్‌కాంగ్ ముందు 194 ప‌రుగుల భారీ ల‌క్ష్యం నిలిచింది.


Rohit Sharma : మీటింగ్‌కు రాని అజిత్ అగార్క‌ర్‌.. రోహిత్ శ‌ర్మ భ‌విష్య‌త్తుపై బీసీసీఐ కీల‌క వ్యాఖ్య‌లు..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు ఓపెన‌ర్లు స్మృతి మంధాన‌, ష‌ఫాలీ వ‌ర్మ (28; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు తొలి వికెట్‌కు శుభారంభాన్ని అందించారు. 7.6 ఓవ‌ర్ల‌లో 74 ప‌రుగులు జోడించారు. వేగంగా ఆడే క్ర‌మంలో ష‌ఫాలీ ఔటైంది. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన ప్ర‌తీకా రావ‌ల్ (10), రిచా ఘోష్ (11), హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌(10) విఫ‌ల‌మైన‌ప్ప‌టికి కూడా మ‌రో ఎండ్ స్మృతి మంధాన త‌నదైన శైలిలో దూకుడుగా ఆడింది. ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతూ బౌండ‌రీ వ‌ర‌ద పారించింది. 57 బంతుల్లోనే సెంచ‌రీ సాధించింది.

టీ20ల్లో మంధాన‌కు ఇది రెండో శ‌త‌కం. సెంచ‌రీ త‌రువాత కూడా స్మృతి దూకుడుగా ఆడింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో ర‌నౌట్ అయింది. స్మృతి రాణించ‌డంతో భార‌త్ భారీ స్కోరు సాధించింది. హాంగ్ కాంగ్ బౌల‌ర్ల‌లో మరీనా లాంప్లో రెండు వికెట్లు తీసింది. రుచిత వెంకటేష్, జోయిలీన్ కౌర్‌లు చెరో ఓ వికెట్ సాధించారు.