Women’s T20 World Cup Final.. Aus vs SA Live Updates: ఆరోస్సారి.. వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి అదరగొట్టింది. ఆరోసారి మహిళల టీ20 వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో సౌతాఫ్రికాపై 19 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది.

Women's T20 World Cup Final

Women’s T20 World Cup Final: ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి అదరగొట్టింది. ఆరోసారి మహిళల టీ20 వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో సౌతాఫ్రికాపై 19 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది.

తొలి సెమీఫైనల్ మ్యాచులో భారత మహిళా జట్టును ఓడించిన “ఆస్ట్రేలియా”.. రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ ను ఓడించిన “దక్షిణాఫ్రికా” ఫైనల్ లో తలపడ్డాయి. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో ఈ మ్యాచ్ జరిగింది.

2009లో తొలి ఐసీసీ విమెన్స్ టీ20 ప్రపంచ కప్ జరిగింది. ప్రపంచ కప్ మొట్టమొదటి విజేత ఇంగ్లండ్ జట్టు. అనంతరం 2010, 2012, 2014ల్లో విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. 2016 ప్రపంచ కప్ ను వెస్టిండీస్ గెలిచింది. 2018, 2020 విజేతగా మళ్లీ ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఇప్పటివరకు ఐదుసార్లు కప్ గెలిచింది ఆస్ట్రేలియా. ఇవాళ కప్ గెలవడం ఆరోసారి. దక్షిణాఫ్రికా ఇంతవరకు ఐసీసీ విమెన్స్ టీ20 ప్రపంచ కప్ గెలవలేదు. తొలిసారి విశ్వవిజేతగా నిలవాలని ఆరాటపడింది. కానీ, కల నెరవేరలేదు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 26 Feb 2023 08:55 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

    దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. సునే లూస్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయింది. ప్రస్తుతం క్రీజులో లారా వొల్వార్డ్ట్ 29, ట్రయాన్ 1 పరుగుతో ఉన్నారు. దక్షిణాఫ్రికా స్కోరు 55/3 (11 ఓవర్లకి)గా ఉంది.

  • 26 Feb 2023 08:49 PM (IST)

    దక్షిణాఫ్రికా స్కోరు 10 ఓవర్లకి 52/2

    దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. మెరిజాన్ కాప్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయింది. ప్రస్తుతం క్రీజులో లారా వొల్వార్డ్ట్ 28, సునే లూస్ 1 పరుగుతో ఉన్నారు. దక్షిణాఫ్రికా స్కోరు 52/2 (10 ఓవర్లకి)గా ఉంది.

  • 26 Feb 2023 08:35 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

    దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. తజ్మిన్ బ్రిట్స్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయింది. ప్రస్తుతం క్రీజులో లారా వొల్వార్డ్ట్, మెరిజాన్ కాప్ ఉన్నారు. స్కోరు 22/1 (6 ఓవర్లకి)గా ఉంది.

  • 26 Feb 2023 08:19 PM (IST)

    తొలి రెండు ఓవర్లలో 6 పరుగులు

    దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా లారా వొల్వార్డ్ట్, తజ్మిన్ బ్రిట్స్ క్రీజులో వచ్చారు. తొలి రెండు ఓవర్లలో 6 పరుగులు మాత్రమే చేశారు.

  • 26 Feb 2023 08:02 PM (IST)

    దక్షిణాఫ్రికా లక్ష్యం 157 పరుగులు

    దక్షిణాఫ్రికా ముందు ఆస్ట్రేలియా 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ బాదడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో అలిస్సా హీలీ 18, బెత్ మూనీ 74 (నాటౌట్), గార్డనర్ 29, గ్రేస్ హ్యారీస్ 10, మెగ్ లానింగ్ 10, ఎల్లీస్ పెర్రీ 7, జార్జియా వేర్‌హామ్ 0, మెక్ గ్రాత్ 1 (నాటౌట్)పరుగు చేశారు. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 20 ఓవర్లకు 156/6 గా నమోదైంది.

  • 26 Feb 2023 07:49 PM (IST)

    హాఫ్ సెంచరీ బాదిన బెత్ మూనీ

    ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ హాఫ్ సెంచరీ బాదింది. 45 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 134/4(18 ఓవర్లకు)గా ఉంది. క్రీజులో బెత్ మూనీ (53 పరుగులు), మెగ్ లానింగ్ (5) ఉన్నారు.

  • 26 Feb 2023 07:36 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. గ్రేస్ హ్యారీస్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైంది. ప్రస్తుతం క్రీజులో బెత్ మూనీ (41 పరుగులు), మెగ్ లానింగ్ (5) ఉన్నారు.

  • 26 Feb 2023 07:29 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. గార్డనర్ 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైంది. ప్రస్తుతం క్రీజులో బెత్ మూనీ (38), గ్రేస్ హ్యారీస్ (2) ఉన్నారు.

  • 26 Feb 2023 07:18 PM (IST)

    ఆస్ట్రేలియా స్కోరు 10 ఓవర్లకు 73/1

    ఆస్ట్రేలియా స్కోరు 10 ఓవర్ల నాటికి 73/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో బెత్ మూనీ (26), గార్డనర్ (27) ఉన్నారు.

  • 26 Feb 2023 06:58 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అలిస్సా హీలీ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయింది. ప్రస్తుతం క్రీజులో బెత్ మూనీ (15), గార్డనర్ (0) ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు 36/1 (6 ఓవర్లకు)గా ఉంది.

  • 26 Feb 2023 06:12 PM (IST)

    తుది జట్లలో ఎవరెవరు?

    దక్షిణాఫ్రికా విమెన్స్ జట్టు: లారా వొల్వార్డ్ట్, తజ్మిన్ బ్రిట్స్, మెరిజాన్ కాప్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, సునే లూస్ (కెప్టెన్), అన్నేకే బోష్, సినాలో జాఫ్తా, షబ్నిమ్ , అయాబొంగా ఖాకా, మ్లాబా

    ఆస్ట్రేలియా విమెన్స్ జట్టు: అలిస్సా హీలీ, బెత్ మూనీ, మెగ్ లానింగ్(కెప్టెన్), గార్డనర్, గ్రేస్ హ్యారీస్, ఎల్లీస్ పెర్రీ, తహ్లియా మెక్‌గ్రాత్, జార్జియా వేర్‌హామ్, జెస్ జోనాసెన్, మేగాన్, డార్సీ బ్రౌన్.

  • 26 Feb 2023 06:06 PM (IST)

    ఆస్ట్రేలియా బ్యాటింగ్..

    ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి, మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

  • 26 Feb 2023 05:52 PM (IST)

    ఆల్ ది బెస్ట్

    తమ ఫేవరెట్ జట్టుకు పలువురు "ఆల్ ది బెస్ట్" చెబుతున్నారు..