×
Ad

IND w vs AUS w : సెమీస్ మ్యాచ్‌.. లిచ్‌ఫీల్డ్ శ‌త‌కం.. భార‌త్ ముందు ఆసీస్ భారీ ల‌క్ష్యం

సెమీస్ మ్యాచ్‌లో భార‌త్ ముందు ఆస్ట్రేలియా (IND w vs AUS w) భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

Womens World Cup 2025 IND w vs AUS w Semis match India Women target is 339

IND w vs AUS w : మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా న‌వీ ముంబై వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. భార‌త్ ముందు 339 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.5 ఓవ‌ర్ల‌లో 338 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119; 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) సెంచ‌రీ సాధించింది.

Rohit Sharma : ముంబైని వీడి కేకేఆర్‌కు వెళ్ల‌నున్న రోహిత్ శ‌ర్మ‌?.. అది మాత్రం క‌న్ఫార్మ్ అంటూ ముంబై పోస్ట్..

మిగిలిన వారిలో ఎలీస్ పెర్రీ (77; 88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఆష్లీ గార్డనర్ (63; 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. బెత్ మూనీ (24) రాణించింది. టీమ్ఇండియా బౌలర్లలో శ్రీ చరణి, దీప్తి శర్మలు చెరో రెండు వికెట్లు తీశారు. క్రాంతి గౌడ్, అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్ త‌లా ఓ వికెట్ సాధించారు.