Rohit Sharma : ముంబైని వీడి కేకేఆర్‌కు వెళ్ల‌నున్న రోహిత్ శ‌ర్మ‌?.. అది మాత్రం క‌న్ఫార్మ్ అంటూ ముంబై పోస్ట్..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్‌ను రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) వీడ‌నున్నాడు అని వ‌స్తున్న వార్త‌ల‌పై ఎంఐ స్పందించింది.

Rohit Sharma : ముంబైని వీడి కేకేఆర్‌కు వెళ్ల‌నున్న రోహిత్ శ‌ర్మ‌?.. అది మాత్రం క‌న్ఫార్మ్ అంటూ ముంబై పోస్ట్..

Rohit Sharma joining KKR in IPL 2026 Mumbai Indians replay

Updated On : October 30, 2025 / 6:47 PM IST

Rohit Sharma : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఐపీఎల్ భ‌విష్య‌త్తు పై మ‌రోసారి చ‌ర్చ మొదలైంది. ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు అత‌డు ముంబై ఇండియ‌న్స్‌ను వ‌ద‌లి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌లో జాయిన్ అవుతాడ‌నే వార్త‌లు గ‌త రెండు రోజులుగా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

రెండేళ్ల క్రితం ముంబై ఇండియ‌న్స్.. రోహిత్ శ‌ర్మను జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది. ఆల్‌రౌండ‌ర్ హ‌ర్దిక్ పాండ్యాకు ఆ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. ఈ క్ర‌మంలో హిట్‌మ్యాన్ జ‌ట్టును వీడుతాడు అంటూ అప్ప‌టి నుంచి వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇక రోహిత్ మాత్రం ముంబై త‌రుపున‌నే ఆడుతూ వ‌స్తున్నాడు.

IND A vs SA A : రిష‌బ్ పంత్ నాయ‌క‌త్వంలో చ‌మ‌టోడ్చిన భార‌త బౌల‌ర్లు.. ముగిసిన తొలి రోజు ఆట..

అయితే.. ఇటీవ‌ల కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ చేసిన ఓ పోస్ట్ ఊహాగానాల‌కు మ‌రింత ఆజ్యం పోసింది. ఇటీవ‌ల ఆసీస్‌తో ముగిసిన మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ రాణించాడు. ఈ క్ర‌మంలో ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానంలోకి దూసుకువెళ్లాడు. హిట్‌మ్యాన్ కెరీర్‌లోనే వ‌న్డేల్లో తొలిసారి మొద‌టి ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డికి అభినంద‌న‌లు తెలుపుతూ కేకేఆర్ ఓ పోస్ట్ చేసింది.

కేకేఆర్‌కు రోహిత్ శ‌ర్మ వ‌స్తున్నాడా? ఓ నెటిజ‌న్ అడుగ‌గా.. అందుకు కేకేఆర్ కన్ఫార్మ్.. వరల్డ్​ నెం.1 వన్డే బ్యాటర్ అంటూ రిప్లై ఇచ్చింది. అదే స‌మ‌యంలో కేకేఆర్ హెడ్ కోచ్‌గా రోహిత్ శ‌ర్మ స్నేహితుడు అభిషేక్ నాయ‌ర్ నియ‌మితులు కానున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో హిట్‌మ్యాన్ కేకేఆర్‌లో చేయ‌డం ఖాయం అని చాలా మంది భావించారు.

Abhishek Nayar : ఐపీఎల్ 2026కి ముందు కీల‌క మార్పు.. కేకేఆర్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌

స్పందించిన ముంబై..

ఇక ఇవాళ కేకేఆర్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయ‌ర్‌ను నియ‌మించిన‌ట్లుగా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ ప్ర‌క‌ట‌న రావ‌డానికి కొద్ది సేప‌టికి ముందు ముంబై ఇండియ‌న్స్ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. రోహిత్ శ‌ర్మ ఎక్క‌డికి వెళ్ల‌డ‌ని, ముంబైతోనే ఉంటాడ‌ని ప‌రోక్షంగా చెప్పుకొచ్చింది.

‘రేపు మ‌ళ్లీ సూర్యుడు ఉద‌యిస్తాడు. అది మాత్రం నిజం. కానీ రాత్రి వేళలో ఉద‌యించ‌డు. అది క‌ష్ట‌మే కాదు అసాధ్యం.’ అంటూ ముంబై ఇండియ‌న్స్ లోగోతో ఉన్న రోహిత్ శ‌ర్మ ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో ఊహాగానాల‌కు తెర‌ప‌డిన‌ట్లైంది.

IND vs SA : గౌహ‌తి టెస్టు మ్యాచ్‌లో కొత్త సంప్రదాయం..! ముందు టీ, ఆ త‌రువాతే లంచ్..

2011లో ముంబై ఇండియ‌న్స్‌లో చేరిన రోహిత్ శ‌ర్మ ఆ జ‌ట్టుకు ఐదు ఐపీఎల్ టైటిళ్ల‌ను అందించాడు. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో రోహిత్ నాయ‌క‌త్వంలోనే ముంబై ఐపీఎల్ విజేత‌గా నిలిచింది.