IND A vs SA A : రిషబ్ పంత్ నాయకత్వంలో చమటోడ్చిన భారత బౌలర్లు.. ముగిసిన తొలి రోజు ఆట..
భారత్ ఏ, సౌతాఫ్రికా ఏ జట్ల (IND A vs SA A) మధ్య జరుగుతున్న అనధికారిక తొలి టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసింది.
IND A vs SA A Day 1 Stumps South Africa first innings 299 loss of 9 wickets
IND A vs SA A : భారత్-ఏ, దక్షిణాఫ్రికా-ఏ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు మ్యాచ్ సిరీస్ ప్రారంభమైంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ మైదానం వేదికగా జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసింది.
రిషబ్ పంత్ సారథ్యంలో భారత్-ఏ జట్టు బరిలోకి దిగింది. టాస్ నెగ్గిన పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా-ఏ జట్టు 9 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. షెపో మోరెకి (4), ఒకుహ్లే సెలె (0) క్రీజులో ఉన్నారు.
Abhishek Nayar : ఐపీఎల్ 2026కి ముందు కీలక మార్పు.. కేకేఆర్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్
సఫారీ బ్యాటర్లలో జోర్డాన్ హెర్మాన్ (71; 140 బంతుల్లో 8 ఫోర్లు), జుబైర్ హంజా (66; 109 9 ఫోర్లు, 1 సిక్స్), రూబిన్ హెర్మాన్ (54; 87 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. టియాన్ వాన్ వురెన్ (46) రాణించాడు. భారత బౌలర్లలో తనుష్ కోటియన్ నాలుగు వికెట్లు తీశాడు. మానవ్ సుతార్ రెండు వికెట్లు పడగొట్టాడు. గుర్నూర్ బ్రార్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
18వ నంబర్ జెర్సీతో..
ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 18వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగాడు. దీంతో అందరి దృష్టి దీనిపైనే పడింది. ఇది టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ అన్న సంగతి తెలిసిందే. కోహ్లీ టెస్టులకు రిటైర్‌మెంట్ ఇచ్చాడు. దీంతో ఆ జెర్సీని పంత్ ధరించాడు. ఇక పంత్ జెర్సీ నంబర్ 17 అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
