IND vs SA : గౌహతి టెస్టు మ్యాచ్‌లో కొత్త సంప్రదాయం..! ముందు టీ, ఆ తరువాతే లంచ్..
గౌహతి వేదికగా నవంబర్ 22 నుంచి 26 వరకు భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.
IND v SA Why Guwahati Test will have tea before lunch break
IND vs SA : వచ్చే నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. తొలుత ఆతిథ్య భారత్‌తో సఫారీలు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడతారు. తొలి టెస్టు మ్యాచ్ నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరగనుంది. ఇక రెండో టెస్టు మ్యాచ్ గౌహతి వేదికగా నవంబర్ 22 నుంచి 26 వరకు జరగనుంది.
సాధారణంగా ఓ టెస్టు మ్యాచ్‌లో రోజుకు 90 ఓవర్ల ఆట ఉంటుంది. రోజును మూడు సెషన్లుగా విభజిస్తారు. తొలి సెషన్ ముగియగానే లంచ్ బ్రేక్, రెండో సెషన్ ముగిసిన తరువాత టీ బ్రేక్ ఇస్తారు. ఇక మూడో సెషన్ ముగిస్తే ఆ రోజుకి ఆట పూరైనట్లు.
అయితే.. గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు టెస్టులో మాత్రం ఓ కొత్త సంప్రదాయ పద్దతిలో మ్యాచ్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక్కడ తొలుత టీ బ్రేక్ రానుంది. ఆ తరువాత లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారు. ఇందుకు కారణంగా అక్కడి వాతావరణ పరిస్థితులే.
గౌహతిలో సూర్యోదయం చాలా త్వరగా అవుతుంటుంది. ఇక సూర్యాస్తమయం కూడా త్వరగానే అవుతుంది. ఈ క్రమంలోనే సూర్యకాంతి ఉన్న సమయంలోనే టెస్టు మ్యాచ్‌ను నిర్వహించాల్సి ఉండడంతో ఈ మార్పులను చేశారు. మ్యాచ్ ఉదయం 9 గంటలకే ప్రారంభం కానుంది.
సెషన్ల టైమింగ్స్ ఇవే..
* తొలి సెషన్ – ఉదయం 9 నుంచి 11 వరకు
* టీ బ్రేక్ – ఉదయం 11 నుంచి 11.20 వరకు
* రెండో సెషన్ – ఉదయం 11.20 నుంచి మధ్యాహ్నం 1.20 వరకు
* లంచ్ బ్రేక్ – మధ్యాహ్నం 1.20 నుంచి 2 గంటల వరకు
* మూడో సెషనల్ – మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
